Pawan Kalyan : శోభన్ బాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో… మిస్ అయిన సినిమా ఇదే…

Pawan Kalyan : టాలీవుడ్ లో చాలా సినిమాలు ఇద్దరికీ హీరోల కాంబినేషన్లో వస్తాయి. అలా వచ్చిన సినిమాలు దాదాపుగా మంచి హిట్ నే అందుకున్నాయి. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్, శోభన్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా మిస్సైంది. అదేంటి ఈ తరం కథానాయకుడైన పవన్ కళ్యాణ్ తో, మొన్నటి తరం సూపర్ స్టార్ శోభన్ బాబుతో సినిమా మిస్ అవ్వడం ఏమిటి అనుకుంటున్నారా. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ సుస్వాగతం ‘ సినిమా. పవన్ కళ్యాణ్ కి ఇది మొదటి సినిమా. ఇది అప్పట్లో బాగా హిట్ అయింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నాన్నగా రఘువరన్ నటించారు. ఆయనకి మరియు పవన్ కళ్యాణ్ కి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు హృదయానికి ఎంతగానో హత్తుకుంటాయి. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి.

Pawan Kalyan : శోభన్ బాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో… మిస్ అయిన సినిమా ఇదే…

In Pawan Kalyan,Shoban babu combination miss these movie
In Pawan Kalyan,Shoban babu combination miss these movie

పవన్ కళ్యాణ్ నటించిన మొట్టమొదటి సూపర్ హిట్ సినిమా ‘ సుస్వాగతం ‘. అప్పట్లో ఈ సినిమా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నాన్న పాత్రలో శోభన్ బాబు గారిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆయన అప్పటికే సినిమాలు మానేసి ఉన్నారు. కానీ మంచి ఎమోషన్ ఉన్న పాత్ర, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే పాత్ర కావడంతో శోభన్ బాబు గారు ఒప్పుకుంటారని అనుకున్నారు ఆ చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గారు. ఈ పాత్ర కోసం శోభన్ బాబు గారిని అడిగితే ఆయన నటించడానికి ఒప్పుకోలేదు. దర్శకుడు శోభన్ బాబుని ఈ సినిమాలో నటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఆయన ఒప్పుకోలేదు.

తాను అభిమానిలో దృష్టిలో మరియు ప్రేక్షకుల దృష్టిలో ఎప్పటికీ హీరో గానే ఉండాలని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వాళ్ళకి కనపడకూడదని శోభన్ బాబు గారు చాలా దృఢంగా ఉండేవారంట. అప్పటికే వయసు మీద పడడంతో స్టార్ స్టేటస్ కూడా తగ్గిపోయింది. దీనితో ఆయన సినిమాలకు దూరంగానే ఉండాలనుకున్నారు, నిర్ణయం మార్చుకోలేదు. ఇలాగే ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘ అతడు ‘ సినిమాను కూడా రిజెక్ట్ చేశారు. ఇందులో నాజర్ గారు పోషించిన పాత్ర కోసం శోభన్ బాబు గారిని అడిగారు. అయితే ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. అలా ఈ క్రేజీ కాంబినేషన్లు అప్పట్లో మిస్ అయ్యాయి.