Intinti Gruhalakshmi 2 August Today Episode 700 : శ్రుతి వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేసిన తులసి, శ్రుతి ప్రేమ్ ల గొడవ గురించి తులసికి తెలుస్తుందా?

Intinti Gruhalakshmi 2 August Today Episode 700 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 02-August-2022(700 episode) ఎపిసోడ్ ముందుగా మీ కోసం హనీ పాప సామ్రాట్ తో ఇల్లంటే చుట్టూ పనివాళ్లు, ఏసీలు, టీవీ అనుకున్నాను ఇన్నాళ్లు. కానీ అవేవీ కాదని, ఇప్పుడే తెలుసుకున్నాను. స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి మాట్లాడ్డానికి ఎవ్వరూ ఉండరు, పనివాళ్లు తప్ప, ఆడుకోడానికి ఎవ్వరూ ఉండరు పనివాళ్లు తప్ప, ప్రేమగా కథలు చెప్తూ గోరుముద్దలు తినిపించడానికి ఎవ్వరూ ఉండరు పనివాళ్లు తప్ప, ఇంట్లో పని చేసే వాళ్లందరికీ నేనంటే భయం, నాకు దూరం దూరంగా ఉంటారు.నాకు ఏమన్నా అయితే, నువ్వేమన్నా అంటావని, బిక్కుబిక్కుమంటూ, నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది నాన్నా అని అంటుంది. రేపటి నుంచి నువ్వు స్కూల్ నుంచి వచ్చేలోపు, నేను ఇంటికి వస్తాను త్వరగా, ఎంచక్కా మనం ఆడుకుందాం, కథలు చెప్పుకుందాం, అని అనగానే పిల్లలకు అబద్ధం చెప్పొద్దు నాన్నా అని అంటుంది పాప.

తులసి ఆంటీ వాళ్ల ఇల్లు చూడు నాన్న ఎంచక్కా ఎంతమంది ఉంటారు, అక్కలు, అన్నయ్యలు, ఇలా ఎంతమంది ఉంటారో, మన ఇంట్లో ఎందుకు ఎవ్వరూ ఉండరు నాన్నా అని అంటుంది.అప్పుడు సామ్రాట్ బాధపడుతూ, గతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఇంతలో పాప సారీ నాన్నా అనగానే, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు అమ్మ, నువ్వడిగిన ప్రతి ప్రశ్న, ప్రతి రోజూ నేను దేవుడిని అడుగుతూనే ఉన్నాను.రాయి కదా అమ్మా, దేవుడు సమాధానం చెప్పలేదు. నేను మనిషిని కదా అమ్మా, నాకు కన్నీళ్లు వచ్చాయి అని, బాధపడుతూ వుంటాడు కొద్దిసేపు. పాప వెళ్లిపోయాక, సామ్రాట్ వాళ్ల బాబాయ్ సామ్రాట్తో ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది గతం గురించి కాదు, హాని గురించి అని అంటాడు. తర్వాత తులసి అంకితతో, ప్రేమ్ ఇంతకు ముందులాగా ఉండటంలేదు, నీకేమైనా కారణం తెలుసా అని అంటూ ఉంటుంది. తెలీదు ఆoటి, అలా ఏమీ లేదు, అని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.

Intinti Gruhalakshmi 2 August Today Episode 700 : శ్రుతి వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేసిన తులసి, శ్రుతి ప్రేమ్ ల గొడవ గురించి తులసికి తెలుస్తుందా?

Intinti Gruhalakshmi 2 August Today Episode 700
Intinti Gruhalakshmi 2 August Today Episode 700

తర్వాత తులసి, ప్రేమ్ దగ్గరికి వెళ్లి, నేను శ్రుతి వాళ్ల అత్తయ్యకి ఫోన్చేసి, శ్రుతిని పంపించమని అడుగుతాను అని, ఫోన్ చేస్తుంది.మీకు ఎలా ఉంది, ఆరోగ్యం బాలేదు అని ప్రేమ్ చెప్పాడు, అని అనగానే, ఏదో మాయ రోగం వచ్చిందిలే అని అంటూ, నాకు ఓపిక లేదు అని ఫోన్ కట్ చేస్తుంది. తరువాత శృతితో, వాళ్ల అత్తయ్య చూడు ఎలా చేశాడో, నాకు రోగం అంటకట్టాడు మీ ఆయన అని అనగానే, నేను ఇక్కడ ఉన్నానని చూడకుండా ఎలా చెప్పాడు ఆంటీతో అంటే, చూసే చెప్పాడేమో అని వాళ్ళ అత్తయ్య అనగానే, శృతి మనసులో ప్రేమ్ వచ్చెదాక గడపదాటని ఇంత మారిపోతాడా అని అనుకుంటూ ఉంటుంది. తులసి, అంకిత ప్రేమ్ తొ ఏంటి మాట్లాడేలోపు ఫోన్ కట్ చేసారు, అని అంటూ ఉండగా, ఇంతలో సామ్రాట్ వాళ్ల బాబాయ్ ఫోన్ చేసి, నాకొక మాట ఇవ్వమ్మా అని అనగానే, ఏంటి అని అడుగుతుంది.

నువ్వు ఇక్కడికి రావాలి అమ్మా రేపు పార్టీకి పాపకోసం అని, ఇప్పుడు చాలా డల్లయిపోయింది, నువ్వే తనని మళ్ళీ మామూలు చెయ్యాలి అని, అంటాడు అప్పుడు తులసి సరే అంటుంది. తులసి అంకిత ఫ్రేమ్తో శ్రుతి కూడా ఇక్కడే ఉంటే బాగుండేది, రేపు మనం పార్టీకి వెళ్లాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రేమతో అంకిత గొడవలు పెద్దది చేసుకోకు ప్రేమ్ ఎలాగైనా మాట్లాడు శ్రుతి తొ అని అనగానే, ప్రేమ్ వినకుండా తను వచ్చేదాకా నేను వెళ్లను అని అంటాడు.ఒకవైపు లాస్య, నందుతో పార్టీకి వెళదాం రేపు అని అనగానే, నందు రాను నేను, తులసి వాళ్లు వస్తారు అక్కడికి ఆఫీసులో భరించడమే ఎక్కువ అని ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు,అప్పుడు లాస్య నువ్వు తులసికి మాజీ భర్త అని తెలిస్తే, మనం రోడ్డుమీద పడాల్సి వస్తుంది అని అంటూ ఉండగా, ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.