Intinti Gruhalakshmi 26 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 26-September-2022 ఎపిసోడ్ 747 ముందుగా మీ కోసం.ప్రెస్ మీట్ కోసం తులసి రెడీ అవుతూ ఉంటుంది, హడావిడిగా వస్తూ ఉంటుంది, సారీ అండీ లేటైంది అనగానే, ఏం పరవాలేదు మీరు టెన్షన్ పడకండి, ఎవరైనా ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగితే, నా వైపు చూడండి నేను సమాధానం చెబుతాను, ఎక్కువగా వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అనగానే, ఇంతలో అని కూడా వస్తుంది, ఆంటీ మీరు చాలా బాగున్నారు ఈ చీరలో అని అంటుంది, నీకంటే నా హని అనగానే, అందరూ నవ్వుతారు, నేను కూడా నీ దగ్గరే కూర్చుంటాను ఆంటీ ప్రెస్మీట్లో అని అనగానే, హనీ వాళ్ల తాతయ్య వద్దమ్మా కూర్చోవద్దు, నా దగ్గర కూర్చొ అని అనగానే, సామ్రాట్ పర్వాలేదు రానివ్వండి నా వారసురాలే కదా అన్నీ నేర్చుకుంటోంది నా దగ్గరె కూర్చుంటుంది అని అనగానే, తులసి కూడా సరే అంటోంది. ప్రెస్ వాళ్లు వచ్చి అరగంట అయింది ఇంకా రావటం లేదు అసలు లోపల వీళ్ళు ఏమి చేస్తున్నారు అని నందు లాస్యతో అంటాడు, అప్పుడు లాస్య నందుని రెచ్చగొడుతూ ఉంటుంది.
వాళ్ళు ముగ్గురూ హాని తులసి సామ్రాట్ కలిసి రావడంతో లాస్య అసలు చూడు ఎలా వస్తున్నారు మీ పెళ్లిలో కూడా ఇంత వైభవములు లేదనుకుంటా తులసికి అని మాట్లాడుతూ ఉంటుంది, ఇంతలో సామ్రాట్ తులసి వస్తారు అందరికీ గుడ్మార్నింగ్ చెప్పి కూర్చుంటారు, సామ్రాట్ మాట్లాడేలోపు రిపోర్టర్స్ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అప్పుడు లాస్య అంటూ ఉంటుంది ముందు సార్ని మాట్లాడనివ్వండి అనగానే, అయితే మేమెందుకు రావడం మీరు చెప్పింది అడగాలా అయితే మేం వెళ్లిపోతున్నాం అనగానే, కూర్చోండి ఫరవాలేదు మీరు అడగండి అని సామ్రాట్ అనడంతో, అసలు భూమిపూజ రోజే తులసి గారూ బిజినెస్ డీల్ నుంచి తప్పుకున్నారు మళ్లీ ఇప్పుడు ఎలా ప్రారంభించారు మీరు పరువుకోసం తులసిగారి కాళ్లు పట్టుకున్నారా ఏంటి అని వెటకారంగా ప్రశ్నిస్తుంది ఒకావిడ, దానికి తులసి మీరు ప్రశ్నలు అడగొచ్చు కానీ, అడిగే పధ్ధతి బాగుండాలి అని అంటూ ఉంటుంది, సామ్రాట్ తులసిని ఆపుతాడు, ఇంతలో వేరే ఇంకొక రిపోర్టర్ ఈ ప్రశ్న అంటే రూమర్ ఇంకా వేరేది అడుగుతాను అని, అసలు ఏ చదువులేని ఆవిడకి మీరు మేనేజర్ పోస్టు ఎలా ఇచ్చారు.
Intinti Gruhalakshmi 26 September Today Episode : రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన తులసి
మీ కoపెనీ లొ చాలా మందున్నారు అయినా మీరెందుకు తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, మీ ఇద్దరి గురించి బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, మీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతు ఉన్నారు అని మీరిద్దరూ త్వరలోనే ఒక్కటికాబోతున్నారు అని ఇలా చాలామంది బయట అనుకుంటున్నారు, మీరు సమాధానం చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉంటారు, మీ బిజినెస్ పార్టనర్ ని మీ లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడం వరకు ఓకె, మరి మీ భార్య సంగతి ఏంటి ఎప్పుడూ మీరు మీ భార్య గురించి చెప్పలేదు, ఈ నిందలన్నీ నిజాలని మీరు ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తూ ఉంటారు, అప్పుడు తులసి కోపంగా సమాధానం చెబుతూ ఉంటుంది, ఇప్పుడిప్పుడే ఆడవాళ్లు బయటికి వచ్చి బతకడం నేర్చుకుంటున్నారు.
వీలైతే సహాయం చేయాలి అంతే తప్ప ఇదేంటి ప్రశ్నలు ఇలా ప్రశ్నిస్తారా అని అడుగుతూ ఉంటుంది, నా జీవితం వంటింట్లోనే సగం జీవితం గడిచిపోయింది, నాకంటూ గుర్తింపు రావడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను, సామ్రాట్గారూ చాలా గొప్పవారు నాకు సహాయం చేస్తున్నారు అంతే తప్ప మీరనుకుంటున్నట్టు ఏదీలేదు, మానవత్వంతో మాట్లాడండి, మీ ఇంట్లో వాళ్లు కూడా ఆడవాళ్ళు, బయటికెళ్లి పనిచేస్తున్నారు కదా ఆడవాళ్లు పనిచేస్తున్నారు అంటే మీరు ఈ ఉద్దేశంతోనే చూస్తారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది.
పిల్లలకి మంచిచెడులు చెప్పేతల్లి నీతి ని ఏలా తప్పుతుందని మీరెలా అనుకుంటున్నారు, బయట ఎవరు ఏమనుకున్నా మాకు సంబంధం లేదు, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం వ్యాపార భాగస్వామ్యం మాత్రమే, ఎవరు అవునన్నా కాదన్నా, ఆ భాగస్వామ్యం మాత్రం తెగిపోదు, ఎవరేమనుకున్నా భయపడి వెనక్కి తగ్గేది లేదు రాసుకోండి అని కోపంగా వాళ్ళకి సమాధానం చెప్పడంతో, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు, తులసి అంటుంది మీలొ ఒక్కరూ సామ్రాట్ గారి భార్య గురించి అడిగారు, అసలు మీకు సిగ్గుగా అనిపించడం లేదా, వ్యక్తిగత విషయాలు అడగటం ఏంటి అని అనడంతో, రిపోర్టర్ సామ్రాట్కి స్వారీ చెబుతుంది.
సామ్రాట్ చాలా మెచ్చుకుంటాడు నేను మీకు అండగా ఉంటాను అన్నాను కానీ మీరే నాకు అండగా ఉన్నారు అని అంటాడు.తరువాత దివ్య తులసి దగ్గరికి వచ్చి, మామ్ నాకు చాలా గర్వంగా ఉంది, నేను నీ కూతురు గా పుట్టినందుకు అని చాలా సంతోషపడుతుంది, తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మెచ్చుకుంటూ ఉంటారు తులసి ధైర్యంగా సమాధానం చెప్పిన విధానానికి, అభి ప్రశ్నిస్తూ ఉంటాడు అసలు సామ్రాట్గారూ సమాధానం చెప్పలేదు అలాంటి వ్యక్తిని నమ్ముకొని నువ్వు ఇదoతా చేస్తున్నావు మామ్ అని అనగానే, ఎవరి కారణాలు వాళ్లకుంటాయి అని తులసి సమాధానం చెబుతుంది. ఇలా కుటుంబ సభ్యులందరూ జరిగిన విషయం గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఒకవైపు సామ్రాట్ గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటాడు, హని దగ్గరికి వెళ్లి బాధపడుతూ, నిప్పులాంటి నిజాన్ని నా మనసులో దాచుకొని నీకు నాన్నగా నిలబడ్డాను, ఒక విధంగా అది నిన్ను మోసం చేసినట్టే అవుతుంది, కానీ నీ సంతోషం కోసం నేను ఈ తప్పు చేస్తున్నానమ్మా అని, నాన్న కానీ నాన్నని క్షమించమ్మా, ఈ అన్న ప్రేమని కాదనుకొని నా చెల్లి నన్ను వదిలి వెళ్లిపోయింది, నీలో నా చెల్లిని చూసుకుంటున్నాను, నా చెల్లి ప్రేమ ని చూసుకుంటున్నాను, ఈ భారాన్ని దేవుడిపైనే వదిలిపెడుతున్నాను, దేవుడే చూసుకోవాలి అని అంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.