Intinti Gruhalakshmi 3 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 3-September-2022 ఎపిసోడ్ 728 ముందుగా మీ కోసం. జరిగిన విషయం గురించి సామ్రాట్ తులసి ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. తులసి గారూ నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదు అంటే నిర్లక్ష్యమా, జరిగింది ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నారా, సైలెంట్గా వెళ్లిపోయారు, కనీసం ఇప్పుడు ఫోన్ కూడా చేయలేదు అని సామ్రాట్ అనుకుంటాడు. తులసి నేనూ తప్పూ చెయ్యలేదు ఏం జరిగిందా అని ఫోన్ చేయడం లేదు అని తులసి అనుకుంటుంది. ఇంతలో తులసి మిసెస్ పెడుతుంది సామ్రాట్కి, మ్యూజిక్ స్కూల్ విషయంలో ఇంతవరకూ మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు, ఈ రోజుతో మీ వ్యాపార భాగ స్వామ్యాన్ని వదులుకుంటున్నాను అని మెసేజ్ చేస్తుంది.సామ్రాట్ కోపంగా బయటికి వచ్చి, బాబాయి మీ తులసి ఏం చేసిందో తెలుసా అని అంటాడు. అదేంటి మా తులసి అంటున్నావు, నీ బిజినెస్ భాగస్వామి కదా అని అనగానే, లేదు బాబాయ్ ఈరోజు నుంచి కాదు, మెసేజ్ చేసింది అని, జరిగిన విషయాన్ని చెబుతూ ఉంటాడు.
Intinti Gruhalakshmi 3 September Today Episode : సామ్రాట్ గారికి నిజం చెప్పమని నందుని అడిగిన తులసి.
వల బాబాయ్ కి ఇప్పుడు నా పరువేం కావాలి, అన్ని బిజినెస్ పనులు పక్కకుపెట్టి, మ్యూజిక్ స్కూల్ పాపులర్ చేశాను. ఇలా చేసింది అని మాట్లాడుతూ ఉండగా, వాళ్ల బాబాయ్ బిజినెస్ గురించి కాదు, నువ్వు తులసీ నీ కళ్ల ముందు కనిపించదు అని ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఏంటి బాబాయ్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. నా బాధ నీకు చెప్పుకోవడం బుద్ధి తక్కువ అయింది అని, కోపంగా సమాధానం చెబుతాడు. ఒకవైపు శృతి బట్టలను, ప్రేమ్ బయటపెడతాడు, వీటన్నింటినీ ఉతుక్కో, అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటారు అని ఆటపట్టిస్తూ ఉంటాడు శృతిని.నీళ్లను పొని, చీరలు నువ్వే ఉతుక్కో అని చెబుతాడు. నన్నే ఆటపట్టిస్తావా అని ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. నందు ఏది జరిగిన మన మంచి అనుకుంట లాస్య, ఇప్పుడు వారిద్దరి మధ్య గ్యాపొచ్చింది అని అనుకుంటూ ఉంటారు. సరే పద వెళదాం అని అనుకునే లోపు, తులసి వస్తుంది అక్కడికి.తులసి అంటోంది నందుతో, మన మధ్య ఒక ఒప్పందం జరిగింది.

మీరే మాజీ భర్త అని చెప్పకూడదని, కానీ మీరే ఆ విషయాన్ని చెప్పారు అని అంటుంది. ఆ ఆవును ఇప్పుడేం జరిగింది నష్టం అని నందు అంటాడు. నేనే కావాలని దాచి పెట్టాను అని సామ్రాట్గారూ అనుకుంటున్నారు. మీరు నిజం చెప్పండి అని అంటుంది. నువ్వే చెప్పొచ్చు కదా అని నందు అంటాడు. నేను చెబితే నమ్మడు, నువ్వే చెప్పాలి అని అంటుంది. దాంతో వీళ్లు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు లాస్య, నందు వెటకారoగా.నేను వ్యాపార భాగస్వామ్యం నుంచి తప్పుకుంటున్నట్టు సామ్రాట్ గారికి ఎప్పుడో మెసేజ్ పెట్టాను, అది నా తుది నిర్ణయం అని తులసి అంటుంది.వచ్చి మీరు నిజం చెప్పండి, నేనేదో ద్రోహం చేశానని వాళ్లు బాధపడటం నాకిష్టం లేదు అందుకే నిజం చెప్పామని అంటున్నాను అని తులసి అంటుంది.నేను నిజం చెప్పాలీ అంటే, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది నేనే, నువ్వు కావాలని దాచిపెట్టావు అని చెబుతాను అని అంటాడు నందు. దాంతో తులసి మీరు అసలు మనుషులేనా, నేనేదో మిమ్మల్ని కాపాడితే, మీరిలా చేస్తారా, ఇంతకింతా అనుభవిస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది. లాస్య నందుతో ఈరోజు తులసి నోరు మూయించావు శభాష్ అని అంటోంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.