Jabadasth Faima : జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్స్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే చాలామంది పాపులర్ కూడా అయ్యారు. అలాంటి వారిలో పైమా కూడా ఒకరిని చెప్పాలి. పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఫైమా అనతి కాలంలోనే తన ప్రతిభను నిరూపించుకొని తనకోసమే స్కిట్స్ రూపొందించేలా ఏదిగింది. ఇక బుల్లితెరపై వచ్చిన ఫ్యాన్ బేస్ తో బిగ్ బాస్ హౌస్ లో అవకాశం దక్కించుకొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో కూడా అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత పలు రకాల టీవీ షోస్ లో సందడి చేస్తూ కనిపిస్తుంది.
మరియు ముఖ్యంగా జబర్దస్త్ షోలో ఫైమా ఉండే స్కిట్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇన్ని రోజులు ఇలా సందడి చేస్తూ కనిపించిన పైమా సడన్ గా ఆసుపత్రి బెడ్ పై కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే గత కొన్ని రోజులుగా జబర్దస్త్ మరియు ఈటీవీ షోలలో కనిపించి సందడి చేసిన ఫైమా సడన్ గా ఆసుపత్రి బెడ్ పై కనిపించడంతో పైమాకు ఏమైందని అందరూ ఆలోచిస్తున్నారు. అంతేకాక ఆసుపత్రి బెడ్ పై ఉన్న వీడియోని స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేసింది.
View this post on Instagram
ఆ వీడియోకి క్యాప్షన్ గా ” నా గతమంతా నేను మరిచానే” అని కాప్షన్ రాస్కొచ్చింది. కానీ తాను ఆసుపత్రిలో ఎందుకు ఉంది…?తనకు ఏమైంది అనే విషయాలు మాత్రం ఫైమా తెలియజేయలేదు. ఒక ఈ వీడియో పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఏమైంది అక్క అని కొందరు కామెంట్స్ చేస్తుంటే , మరికొందరు నువ్వు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం లోని మార్పుల వలన పైమాకి జ్వరం ఏమైనా వచ్చిందా అనే సందేహం వస్తుంది. అసలు కారణం ఏంటో తెలియదు కానీ ఆమె అభిమానులు మాత్రం పైమా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.