Janaki Kalaganaledu : జానకి నీ ఇరికించాలి అని ప్లాన్ చేస్తున్న మల్లికా…

Janaki Kalaganaledu : జానకి కలగలేదు లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. 8 సోమవారం ఎపిసోడ్ 361 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జ్ఞానాంబ జానకి చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. దాంతో అందరూ సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. మల్లిక మాత్రం షాక్ కి గురవుతుంది. ఇంతలో జ్ఞానంబ జానకి చదువుకోవాలి అంటే కొన్ని షరతులను పాటించాలి అని చెప్తుంది. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు వి ఈ ఇంటి బాధ్యతలను ఎప్పుడూ వహిస్తూనే ఉండాలి. దానికి నీ చదువు అడ్డం రాకూడదు. అలాగే నీ భర్తను ప్రేమ అనురాగాలతో ఎప్పుడు సంతోషంగా ఉంచాలి. అలాగే ఈ కుటుంబానికి వారసులను ఇవ్వడానికి నీ చదువు అడ్డు రాకూడదు.

ఇలా వీటన్నిటికీ ఒప్పుకుంటేనే నువ్వు చదువుకోడానికి, నేను ఒప్పుకుంటాను. అని అంటుంది. జ్ఞానంబ. వీటిలో ఒక్క ఒక్కదాని నువ్వు తప్పిన అప్పుడు నేను తీసుకునే నిర్ణయం కు నువ్వు తలవంచాలి. నువ్వు నన్ను ఎదిరించొద్దు. అని అంటుంది. అప్పుడు జానకి కొద్దిసేపు ఆలోచించి సరే అత్తయ్య గారు మీ మాటని నేను జవదాటను అని అంటుంది. గోవిందరాజు, రామ,  జ్ఞానాంబ ను తను కావాలనుకునేది ఐపీఎస్ కదా ఇవన్నీ తనకి ఎందుకు పెడుతున్నావు.. అని వాళ్ళిద్దరూ అంటారు. అప్పుడు జ్ఞానంబ నా భయం నాకుంటుంది. కచ్చితంగా నేను పెట్టిన షరతులను ఫాలో అవ్వాలి అలాగైతేనే నేను ఒప్పుకుంటాను అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు గోవిందరాజు అది కాదు జ్ఞానం అని అంటుండగా..

Janaki Kalaganaledu : జానకి నీ ఇరికించాలి అని ప్లాన్ చేస్తున్న మల్లికా…

Janaki Kalaganaledu 08 August 2022 episode 361
Janaki Kalaganaledu 08 August 2022 episode 361

గోవిందరాజుని ఇక అంతే ఇంకా మీరు ఎవరు ఏం మాట్లాడొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. మల్లిక మాత్రం సంతోషంతో నేనున్నాను కదా తనని ఇరికించడానికి అని అనుకుంటూ ఉంటుంది. ఏదో ఒక ప్లాన్ వేసి నేను తనని బుక్ చేస్తాను కదా ఈ మల్లికా ఉంది కదా అని ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే జానకి రామాత్ ని మనం పిల్లలు కనే పనిలో ఉండాలి అని తనతో రొమాంటిక్ దగ్గర అవ్వాలని చూస్తుంది. అప్పుడు రామ అదేంటండి మీరు అలా మాట్లాడుతారు. మీరు పిల్లలు కంటే మీ చదువు మీద ఎలా దృష్టి పెడతారు. మీరు ఐపీఎస్ అయ్యేవరకు ఇలాంటివన్నీ ఏమీ పెట్టుకోకండి అని తను బయటికి వెళ్లిపోతాడు. మల్లిక ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞానాంబకి చెప్పాలి అని వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.