Janaki Kalaganaledu 12th July Today Episode : రామ, జానకిల ఫస్ట్ నైట్ జరుగుతుందా… వీళ్ళిద్దరూ జ్ఞానంభ, గోవిందరాజు ల ఆశ నెరవేరుస్తారా..

Janaki Kalaganaledu 12th July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది 12 జులై 2022 మంగళవారం ఎపిసోడ్ 342 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జానకి రామ పాడిన పాటను మెచ్చుకుంటూ చికిత గబ్బర్ సింగ్ సినిమా లాగా మన అంతాక్షరి సినిమా కూడా అదిరిపోయింది అండి అంటుంది. ఈ మల్లికా ఉంటే ఎక్కడ ఎసరే చిన్నికి చాట్ అవ్వాల్సిందే అంటుంది మల్లికా చికిత మీరు లేకపోతే ఇంకా బాగుండేదండి. మల్లిక చికితను అమ్మను అమ్మమ్మో కోడి గుడ్డు వచ్చి కోడిని ఎక్కిరించిననట్టు ఇంత ఎటకారం చేస్తావా ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సంగతి చెప్తా అని చికిత ను తిడుతుంది.

చికిత ఇదే సీన్లో డాన్సులు కూడా ఉంటే అలా వైకుంఠపురం సినిమాలో పాట లాగా ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటుంది. అఖిల్, గోవిందరాజు చికిత సూపర్ ఐడియా వేస్తే బాగుంటది. మొదలెట్టండి అని గోవిందరాజు అంటాడు. మల్లికా ఈ ఇంటికి నేనే ముందు వచ్చిన కోడలు కాబట్టి ఆ డాన్సింగ్ ఏది మేమే ముందు మొదలు పెడతాం అంటుంది. విష్ణు ని ఏవండీ ఏవండీ అప్పట్లో చిరంజీవి రాధిక లాగా మనం కూడా ఇరగదీద్దాం పదండి అని వెళ్లి “శ్రీవారు దొరగారు” అనే పాటకి డాన్స్ చేస్తారు. విష్ణు ,మల్లిక, గోవిందరాజు అమ్మ మల్లికా అద్భుతం మహాద్భుతం చాలా బాగా చేశారు.

Janaki Kalaganaledu 12th July Today Episode
Janaki Kalaganaledu 12th July Today Episode

మీరు, ఏదో మీ అభిమాన మావయ్య గారు అంటుంది. మల్లికా, గోవిందరాజు కాకపోతే మీరు చేసింది డాన్స్ అని మా అందరికీ తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టిందమ్మా.. మల్లిక అవాక్కయి చూస్తుంది. ఇంతలో జ్ఞానంభ నిజమే అమ్మ మల్లికా మీ మామయ్య గారితో సరదాగా అంటున్నాడు మీ ఇద్దరు చాలా బాగా చేశారు. మల్లిక నేనంతే అత్తయ్య గారు డాన్సర్ని ,విష్ణు కాలు విరిగినానా, తిరిగినాన అని కామెడీ చేస్తాడు. అఖిల్ ఇప్పుడు జానకి వదిన అన్నయ్య వెళ్ళండి అని అంటారు. మేము వద్దులేరా అని రామ అంటాడు. గోవిందరాజ్ హరే రామ వెళ్లండి రా అని అంటాడు. సరే అని రామ, జానకి అంటారు.

Janaki Kalaganaledu 12th July Today Episode : రామ, జానకిల ఫస్ట్ నైట్ జరుగుతుందా

ఇంతలో మల్లిక హీరోయిన్ గారు ఎంత డాన్స్ చేసిన ఈ మెల్లగా పోటీన సాటిన సింహం ముందు కుందేలు పిల్ల ఎగిరినట్టు ఉంటుంది. అని ఫోజులు కొడుతుంది. చికిత జానకమ్మ గారు పెద్ద బాబు గారు రెడీ మరి అనగానే వాళ్ళిద్దరు “మనసు మరీ మత్తుగా” అనే సాంగ్ కి చాలా రొమాంటిక్గా డాన్స్ వేస్తు ఉంటారు రామ, జానకి గోవిందరాజు జ్ఞానం రాముడు జానకి మధ్యన మంచి అన్యోన్యత ఉంది జ్ఞానం కాకపోతే వారిద్దరికీ సరియైన ఏకాంతం లేదు అంతే వాళ్ళు కాస్త దూరంగా ఉంటున్నారు. అందుకనే వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించడం కోసం మనం ఒక పని చేద్దాం.జ్ఞానం ఏంటండీ అది అని జ్ఞానం అడుగుతుంది.

గోవిందరాజు సీక్రెట్ గా చెప్తాడు జ్ఞానాంబకు, ఇదేదో చాలా బాగుందండి అంటుంది జ్ఞానంభ గోవిందరాజు ఇంకెందుకు ఆలస్యం ఈరోజే ఆచరణలో పెట్టేద్దాం.. రామా జానకి డాన్స్ చాలా బాగుంది అదరగొట్టేసారు అని అందరు అంటారు. అందరూ చప్పట్లు కొడతారు. జానకి థాంక్స్ మామయ్య గారు అని అంటుంది .ఇంతలో మల్లికా పర్లేదు జానకి బాగానే చేశావు కాకపోతే ఆ కాలు కలిపే విధానం అదే అంత చక్కగా రాలేదు ఈసారి చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకో లేకపోతే నన్ను అడుగు నేను చెప్తాను కదా విష్ణు పెద్ద డాన్స్ మాస్టర్ బయలుదేరిందని అని అని కామెడీ చేస్తాడు. జ్ఞానాంబ రామా ..తెలిసిన వాళ్ళతో మాట్లాడే పనుంది నేను మీ నాన్న కలిసి వెళ్తాం మీరు ఇక్కడే సాయంత్రం వరకు ఉండి సరదాగా గడిపిరండి …

రామ సరే అమ్మ అంటాడు. జ్ఞానాంబ గోవిందరాజు ఇద్దరు కలిసి అక్కడనుండి వెళ్లిపోతారు . కట్ చేస్తే జ్ఞానాంబ గోవిందరాజు రామ జానకిల కోసం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తు గోవిందరాజు తెగ సందడి చేస్తూ ఉంటాడు. జ్ఞానాంబ ఏం చేస్తున్నారండి, గోవిందరాజు నా యువరానికి పుష్పాభిషేకం చేస్తున్న జ్ఞాను. నేను చెప్పింది అలంకరించమని నామీద చల్లమని కాదు పిల్లలు వచ్చే టైం అయింది. త్వరగా కానివ్వండి అని అంటుంది జ్ఞానంబా, గోవిందరాజు జ్ఞానం ఈ పూలను చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అని జ్ఞానాంబని అడుగుతాడు. జ్ఞానాంబ మీరు ఎలా పడితే అలా పడేస్తున్నారు అనిపిస్తుంది.

గోవిందరాజు ఆ రోజుల్లో మరి సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇలాగే అలంకరణ మల్లెపూల వాన అని పాట పాడుతూ సందడి చేస్తూ ఉంటాడు. ఆగండి ఆగండి చాలు ఇంకా ఏదైనా సందర్భం వస్తే చాలు. పాత విషయాలన్నీ పొట్టలో నుంచి చీమలు బయటికి వచ్చినట్లుగా మీకు భలే గుర్తొస్తాయి. త్వరగా కానివ్వండి అలంకరించండి. అని అంటుంది జ్ఞానాంబ. గోవిందరాజు పిల్లల శుభకార్యానికి స్వయంగా తల్లిదండ్రులే అలంకరించడం ఒక విధమైన జ్ఞాపకమే కాదు తెలియని సంతోషం కూడా జ్ఞాను . నువ్విలా అలంకరిస్తున్నప్పుడు నీ కళ్ళల్లో కన్నీటి చెమ్మని చూశాను జ్ఞానం. తెలుస్తుంది ఆ కన్నీటి చెమ్మను చూస్తే తెలుస్తుంది ఈ ఇంటి వారసుల కోసం నువ్వు ఎంత అరాటపడుతున్నావో అంటాడు.

ఈ ఇంటి వారసుల కోసం కాదండి ఈ గుండెను ఆనందంతో నింపే జ్ఞాపకం కోసం ఎదురుచూస్తున్నానండి. ఎవరైనా వాళ్లకి పిల్లలు పుట్టగానే ఆ పిల్లల భవిష్యత్తు కోసం తపన పడతారు. వాళ్లకు పెళ్లి అవ్వగానే వాళ్లకు పుట్టబోయే పిల్లల కోసం ఎదురు చూస్తారు. దానికి కారణం పసిపిల్లల నవ్వులు ఇల్లంతా కలకల్లాడుతూ ఉండటం. మనవళ్లు, మనవరాలు పసి అడుగులు ఈ గుండెల మీద ఉండిపోవాలండి. ఆ గుర్తులు , పసివాలతో గడపడమే లోకంగా మారాలని నా మనసు ఆరాటపడుతుంది. అమ్మ అనే పిలుపు నా పేగు కు తగిలితే నానమ్మ అనే పిలుపు నా మనసుకు తగులుతుంది అండి.

ఆ పిలుపు కోసం ఆరాటపడుతున్న అనే తప్ప వారసుల కోసం కాదండి. అని అంటుంది జ్ఞానంభ, గోవిందరాజు అతి త్వరలోనే మన చేతులకు మనవడు మనవరాలు వస్తారు. జ్ఞానం నీ ఆరాటం అంతా ఆనందంగా మారిపోతుంది. కలగంంటున్న జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందుకు వచ్చి నిజమైపోతే చూసుకో.. అని ఇద్దరు సంతోషపడుతూ అలంకరిస్తూ ఉంటారు. కట్ చేస్తే అందరూ ఇంటికి వస్తారు. మల్లిక ఆటపాటలతో ఎంతో ఎంజాయ్ చేసాము రోజు ఇలాగే తోట కెళ్తే ఎంత బాగుంటుందో అంటుంది. చికిత అమ్మగారు పనులు చేయడం తప్పించుకోవచ్చానా. అంటుంది. అని తన చెవి పట్టుకొని మెలేస్తూ ఇది ఈ డైలాగు చేసినందుకు కాదు నువ్వు తోటలో వేసిన డైలాగ్ కోసం అని తిడుతుంది.

గోవిందరాజు ఓరే రాముడు అంటూ వాళ్ల దగ్గరికి వస్తాడు. జ్ఞానంబ ఈరోజు గుడిలో నిద్ర చేస్తే మంచిదట అందుకని రామ, జానకి ,విష్ణు ,మల్లిక తప్ప మిగిలిన వాళ్ళందరూ గుడికి వెళుతున్నమ్. అఖిల్ అదేంటమ్మా అన్నయ్య వదినలు గుడికి రారా అని అంటాడు. గుడిలోని నిద్ర చేయాల్సింది పెళ్లి కాని వాళ్ళు నిద్ర చేస్తే మంచి జీవిత భాగస్వాములు వస్తారు వాళ్లకి పెళ్లి అయ్యాయి కదా.. వాళ్లు రావాల్సిన అవసరం లేదు. అని జ్ఞానాంబ చెప్తుంది. జానకి అది కాదు అత్తయ్య గారు, గుడికి వెళ్తే పుణ్యం కదా. మేము కూడా గుడికొస్తామండీ అని అంటుంది. జానకి, మల్లిక గుడికి వెళ్లే ఓపిక నాకైతే లేదు కానీ అయినా సరే తోటి కోడలికి పోటీగా మనం కూడా గుడికి వెళ్లాల్సిందే.అని మనసులో అనుకుంటుంది.

అవును అత్తయ్య గారు పుణ్యాన్ని పానకాన్ని వదులుకోకూడదంటారు కదా అందుకే మేము కూడా వస్తామండి. మీ పెళ్ళైన జంటలు ఇంట్లోనే ఉండి దేవుడికి దీపం పెట్టాలి. జానకి మీ భార్య భర్తలు ఇంట్లోనే ఉండాలి. అలాగే అత్తయ్య గారు అని జానకి అంటుంది. మల్లిక మీ మాటే నాకు వేదవాక్కు నేను కూడా అలాగే అత్తయ్య గారు అంటుంది. జ్ఞానంభ చికిత అఖిల్ మీరు బయటకు పదండి. జానకి ఇట్రా అని జానకిని పక్కకి తీసుకెళ్తుంది. మల్లికా వామ్మో యమ్మో అత్త కోడలు పక్కకెళ్ళి ఏమని చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ మల్లికా ఇంటి జాగ్రత్తలు చెప్పడానికి మీ అత్తయ్య గారు జానకిని పక్కకి తీసుకెళ్ళు ఉంటారు.

ఎక్కువగా ఆలోచించి ఆ చిన్న బుర్రని ఇబ్బంది పెట్టకు అని అంటాడు గోవిందరాజు , చూడమ్మా జానకి నువ్వు చెప్పకపోయినా మీ భార్యాభర్తల విమధ్య ఒక విషయం గమనించాను రామ నువ్వు దూరంగా ఉంటున్నట్టు నాకు అనిపిస్తుంది మీ ఇద్దరి మనుషులు కలిసి పోయి మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలని మిమ్మల్ని ఏకాంతంగా వదిలేసి మేము గుడికి వెళుతున్నాం. ఆ చెప్పడం మర్చిపోయాను పడుకునే ముందు వంటగదిలో పాలు పెట్టాను అవి తాగేసి పడుకోండి. అంటుంది జ్ఞానంబ, వాళ్ల రెండు జంటలను వదిలేసి జ్ఞానంబ, గోవిందరాజు, అఖిల్ చికిత గుడికి వెళ్ళిపోతారు.

విష్ణు మల్లిక పదండి అని వాళ్ళు వెళ్ళిపోతారు. జానకి గారు అమ్మ మీకు ఏం చెప్పారు అని అడుగుతాడు రామ, చెప్తాను పదండి అని రామాను తీసుకెళ్తుంది. వాళ్లు రూమ్ లోకి వెళ్తారు ఆ రోమంత అలంకరణతో నిండిపోయి ఉంటుంది. వారిద్దరు చూసి ఆశ్చర్యపోతారు. జానకి గారు వీటన్నిటిని ఎవరు ఏర్పాట్లు చేశారు అని అంటాడు. అత్తయ్య గారు అని జానకి చెప్తుంది. అమ్మ.. అవును రామ గారు మన మధ్య దూరం ఉందని అత్తయ్య గారికి తెలిసిపోయింది అత్తయ్య గారి మాటలు అర్థమవుతుంది అందుకే అందర్నీ తీసుకొని గుడికి వెళ్లారు మన కోసం ఇలా ఏర్పాటు చేశారు. దూరంగా ఉంటున్నామని మీరేమైనా అమ్మకు చెప్పారా.. అని రామా అంటాడు.

అలాంటి విషయాలు నేను ఎందుకు చెప్తానండి అసలు ఎలా చెప్పగలను చెప్పండి. అని చెప్తుంది జానకి, అసలు ఈ విషయం అమ్మకు ఎలా తెలిసింది. రామ గారు మనం ఇప్పుడు ఆలోచించాల్సింది. ఎలా తెలిసి ఉండొచ్చు అని కాదు ఎందుకు ఏర్పాటు చేసి ఉంటారు అని పెద్దవాళ్లుగా వాళ్లు మన నుంచి ఏం కోరుకుంటున్నారు అన్నది దాని గురించి ఆలోచించాలి. అత్తయ్య, మామయ్య మనసుని అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించాలి వాళ్లు కోరుకున్నది మనం అందించాలి. అంతేగాని వాళ్ళని బాధ పెట్టడం ధర్మం కాదండి. ఒకసారి ఈ అలంకరణ చూడండి. ఎంత అందంగా ఉందో కదా. మనల్ని మన మనసులని ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు ఉంది.

అత్తయ్య మామయ్యలు మనకోసం ఎంత సంతోషంగా వీటిని అలంకరించి ఉంటారు. జానకి అక్కడున్న బట్టలను తీసి రామకు ఇస్తూ తీసుకొని రామ గారు అని అంటుంది. జానకి గారు మీ ఐపీఎస్ లక్ష్యం గురించి తెలియదు. దానికోసం మనం దూరంగా ఉంటున్నట్లు తెలియక దానికోసం ఏర్పాటు చేసిఉండొచ్చు. కానీ మీరు కూడా ఏంటండీ ఇలా అని రామ అంటాడు. అత్తయ్య మామయ్యలు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా వాటిని మనం ఆచరించాలి కదా అని అంటుంది జానకి, రామ భర్తగా నా బాధ్యతను నేను నిర్వర్తించాలి కదా. నా భార్య కళ ఐపీఎస్ నేను దాన్ని నెరవేర్చాలి కదా అప్పుడే నా బాధ్యత పూర్తయినట్లు అప్పుడే పైనున్న మీ అమ్మానాన్న ఆత్మలు శాంతించేది.

పిఎస్ అయిన మరుక్షణమే మా అమ్మ నాన్న ఇష్టాన్ని వాళ్ళకి అందిద్దాం సరేనా అంటాడు రామ, సరే ఫస్టు మీరు ఈ బట్టలు వేసుకొని రండి. అదేంటండీ మీరు ఎంత చెప్పినా కూడా మళ్లీ అలాగనే మాట్లాడతారు ఏంటండీ అని అంటాడు రామ, రేపు అత్తయ్య గారి వాళ్ళు ఇంటికి వచ్చేలోపు వాళ్లు ఈ బట్టల్లో మనం చూస్తే ఎటువంటి డౌటు రాకుండా ఉంటుంది. అంటుంది జానకి అంతేనంటారా అని రామా అంటాడు. జానకి ముమ్మాటికి అంతే అంటుంది జానకి ఎవరి బట్టలు వాళ్ళు తీసుకుంటారు. ఏం జరిగిందో తెలియాలి అంటే తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే..