Janaki Kalaganaledu 19th July Today Episode : జానకి అరటి తొక్కు మీద కాలు వేయకుండా అసలు ఎలా కిందపడింది. మల్లిక తను వేసిన ప్లాన్ రివర్స్ అవుతుందా..

Janaki Kalaganaledu 19th July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా ప్రసారం కానున్నది. 19 మంగళవారం ఎపిసోడ్ 347 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జానకి, రామ సరసాలు ఆడుకుంటూ ఉంటారు. మల్లికా మాత్రం మండిపోతు కుళ్ళుకుంటూ ఉంటుంది. మల్లిక జానకి రామ కాలు తొక్కడం చూస్తుంది. అప్పుడు వామ్మో బావగారు సిగ్గుపడడానికి ఇదా కారణం వీళ్ళు నాకంటే ముందుగానే పిల్లలు అనేసి ఎలా ఉన్నారు అమ్మో ఐదు సెంట్లు భూమిని కొట్టేద్దామని, చూస్తున్నారు. నేను ఎలాగైనా చేసి వీళ్ళ కంటే ముందు పిల్లలకు కని ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది.

మల్లిక, రామ షాప్ కి వెళ్తూ జాని గారు నేను షాప్ నుంచి సాయంత్రం తొందరగా వస్తాను. మీరు రెడీగా ఉండండి. మీరు అకాడమీ కి వెళ్ళాలి. కదా అని అంటాడు. కానీ జానకి మల్లెపూలు తీసుకొస్తారా.. సాయంత్రం అని కామెడీ చేస్తూ ఉంటుంది. ఐ బాబోయి మీరు అమ్మకి ఇచ్చిన మాటను మర్చిపోండి మీరు మీ చదువు మీద దృష్టి పెట్టండి. అని గట్టిగా చెప్తాడు. కానీ జానకి రామని కన్విన్స్ చేయాలి. అని చూస్తూనే ఉంటుంది. రామా జానకిలు మాట్లాడుకునేది, మల్లికా కిటికీలోంచి చూసుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటుంది.

Janaki Kalaganaledu 19th July Today Episode
Janaki Kalaganaledu 19th July Today Episode

మల్లిక కిటికీలోనుంచి అరటిపండు తిని తొక్కను విసిరేస్తుంది. జానకి కింద పడాలని, జానకి తొక్క మీద కాలేసి కింద పడుతుంది. ఇప్పుడు అందరూ అక్కడికి వస్తారు. మల్లిక ఏం ఎరగనట్టు ఏమైంది జానకి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. జ్ఞానంబా ఎలా పడ్డావమ్మా అని అడుగుతుంది. జానకి చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు పెట్టిన అత్తయ్య గారు, గోవిందరాజు అరటి తొక్క ఎవరి ఈసారి ఇక్కడ బుద్ధి లేకుండా అని తిడుతూ ఉంటాడు. మల్లిక అవును అని సెటైర్లు వేస్తూ ఉంటుంది.

Janaki Kalaganaledu 19th July Today Episode : జానకి అరటి తొక్కు మీద కాలు వేయకుండా అసలు ఎలా కిందపడింది

జ్ఞానాంబ గోవిందరాజును ఏవండీ డాక్టర్ని పిలవండి. తొందరగా అని అంటుంది. కానీ జానకి ఏం వద్దులే అత్తయ్య గారు వేడినీళ్ల కాపడం పెడితే తగ్గిపోతుంది. అని అంటుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను చూసి మల్లిక తట్టుకోలేక కుళ్ళుకుంటూ ఉంటుంది. జ్ఞానంబ రామ జానకిని రూమ్ లోకి తీసుకెళ్ళు అని అంటుంది. కానీ జానకి నేను నడవలేను రామ గారు అని అంటుంది. అప్పుడు రామ జానకిని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. మల్లిక అది చూసి నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏం జరిగింది.

అని అనుకుంటూ ఉంటుంది. జ్ఞానం బా మల్లికను గట్టిగా పిలిచి నువ్వు వేడి నీళ్లు పెట్టు, నేను నొప్పులు మందు తీసుకొని వస్తాను, అని చెప్తుంది. జానకి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడతాడు. రామా గారు , జానకి చాలా బాధపడుతుంది. ఆ బాధను చూసి రామ కూడ చాలా బాధపడతాడు. మల్లిక కిచెన్లో వేడి నీళ్ళు పెట్టుకుంటూ పాట పాడుకుంటూ సంతోషపడుతుంది జానకి కింద పడినందుకు, మల్లిక వేడి నీళ్లు తీసుకెళ్తుంటే తన కాళ్ళ మీద పడతాయి, గట్టిగా అరుస్తూ ఉంటుంది. అంతలో గోవిందరాజు వస్తాడు. మల్లిక పిచ్చిపిచ్చిగా కేకలు వేస్తూ ఉంటుంది.

గోవిందరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నారు మావయ్య గారు ఇందాకల జానకి కింద పడ్డప్పుడు మాత్రం ప్రేమలు వలక పోశారు, నన్నేమో అలా చూస్తున్నారేంటి అని అంటుంది. మల్లికా, గోవిందరాజు దేవుడున్నాడు ఇందాకల జానకి కింద పడటానికి కారణం నువ్వే అయ్యుంటావు, అందుకే దేవుడు మళ్లీ నీకు ఎలా జరిగేలా చేశాడు, అని గోవిందరాజు అంటాడు. జ్ఞానంబ మల్లికను పిలుస్తూ ఉంటుంది. మల్లిక వేడి నీళ్లు తీసుకురామని, కానీ గోవిందరాజు తీసుకొస్తాడు, అదేంటండి మీరు తీసుకొస్తున్నారు ఆ పిల్లోడు ఎటు పోయింది అని అడుగుతుంది.

మల్లిక మీద నాలుగు చుక్కల వేడి నీళ్లు పడ్డాయి అక్కడ డాన్స్ చేస్తుంది అని అంటాడు. జానకి రామ గారు నేను భరించలేకపోతున్నాను రాము గారు అని అంటుంది. రామ జానకి మీ బాధ నేను చూడలేక పోతున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి, అని అంటాడు. జానకి మీరేం టెన్షన్ పడకండి ఇది తగ్గిపోతుందిలేండి అని అంటుంది. జ్ఞానాంబ జానకి అకాల కొంచెం ఇటు జరపమ్మ మందు రాసి కాపాడు పెడతాను అని అంటుంది. కానీ జానకి అయ్యో వద్ద అత్తయ్య గారు నేనే రాసుకుంటాను అని అంటుంది. కూతురికి తల్లి మందిరాయడంలో తప్పు ఏం ఉంది అమ్మ అని అంటుంది.

అయ్యో వద్దు అత్తయ్య గారు నేనే రాసుకుంటాను, లేదా రామ గారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారులెండి అని అంటుంది జానకి, రామ కూడా అమ్మ నేనున్నాను కదా తనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని చెప్తాడు, జ్ఞానంబ ఈరోజు నువ్వు షాప్ కి వెళ్ళకు అమ్మాయితో ఉండు అని చెప్తుంది. రామ జానకి మందు పెట్టి వేడినీళ్ల కాపడం పెడతాడు. మల్లిక అరటి తొక్క దగ్గర కూర్చొని చూస్తూ ఆలోచిస్తూ తొక్క వేసింది వేసినట్లే ఉంది కొంచెం కూడా అది పాడవలేదు, కానీ జానకి ఎలా కిందపడింది. అని ఆలోచిస్తూ ఉంటుంది. జానకి నొప్పితో చాలా బాధపడుతూ ఉంటుంది.

రామ చాలా బాధపడుతూ ఉంటాడు. తనను చూసి, జానకి అమ్మో నొప్పి అని మోతుక్కుంటూ ఉంటుంది. రామ గారు నా బాధ మీకు వినిపించట్లేదా అని అంటుంది. వినిపిస్తుందండి అందుకేగా వేడి నీళ్లు కాపడం పెడుతున్నాను, అని అంటాడు. నొప్పి పైకి చేరుతుందండి. అని కాలు పైకి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ బామ్ రాయండి అని ఉంటుంది. రామ అక్కడ అని భయపడుతూ చూస్తూ ఉంటాడు. రాయండి అని గట్టిగా అంటుంది. రామ భయపడుతూ రాస్తాను అని రాస్తూ ఉంటాడు. జానకిని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. జానకి కూడా రామాను చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది.

జానకి నవ్వుతూ ఉంటుంది. రామ నవ్వుతున్నారేంటండి అని అడుగుతాడు. రామ జానకి గారు మీరు నవ్వడం నేను చాలాసార్లు చూశాను, మీరు అసలు కింద పడ్డారా ఇదంతా డ్రామా అని అడుగుతాడు. జానకి సిగ్గుపడుతూ మీతో ఏకాంతంగా గడపడం కోసం నేను ఎలా చేశాను, అని అంటుంది. అసలు ఏంటి జానకి గారు మీరు ఒకవైపు కోపంగాను ఒకవైపు చిరాగ్గా ఉంది. మీకు నిజంగా దెబ్బ తగిలిందని నేను ఎంత కంగారు పడుతున్నాను. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు అండి. కాపాడుతూ ఉంటాడు. అప్పుడు జానకి రామని గట్టిగా కౌగిలించుకుంటుంది. తరువాత ఏం జరుగుతుందో. తెలుసుకోవాలంటే, రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.