Janaki Kalaganaledu 22nd July Today Episode : జానకి చదువు గురించి గోవిందరాజుకి తెలుస్తుందా.! గోవిందరాజు జ్ఞానంబ దగ్గరనుంచి జానకి సర్టిఫికెట్స్ తీసుకొస్తాడా…

Janaki Kalaganaledu 22nd July Today Episode : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది 22 శుక్రవారం ఎపిసోడ్ 350 హైలైట్ సెంటర్ ఇప్పుడు చూద్దాం… జానకి తన చదువు గురించి వాళ్ళ అత్తయ్య గారికి చెప్పాలని వస్తుంది. సావిత్రి కూతురికి జానకి బంధాలని నిలబెట్టుకోవడం చాలా కష్టం అండి ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రాదు, కాబట్టి మీరు మీ అలవాటులని మార్చుకోండి అని చెప్తుంది. కానీ చెప్పలేక పోతుంది. సావిత్రి కూతురు జానకికి థాంక్స్ నీలాంటి అమ్మాయి ఈరోజుల్లో ఉండడం నేను ఇదే మొదటిసారి చూడడం నిన్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా మా అత్తగారింటికి వెళ్లిపోతారని చెప్తుంది.

అమ్మ దగ్గర నుంచి మీరు సర్టిఫికెట్స్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది ఎలాగండి అని రామ అంటాడు. ఈరోజు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అడ్మిట్ చేయకపోతే రేపటి నుంచి కోచింగ్ కి రానివ్వరండి అని అంటుంది. జానకి, మీ కల నెరవేర్చాలి అని నేను అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటండి అని అంటాడు రామా, ఇంతలో గోవిందరాజు వస్తాడు. రామ జానకి మాట్లాడుకున్నంత వింటాడు ఆశ్చర్యంగా చూస్తూ ఒరేయ్ రాముడు ఇది నిజమా మాకు ఎవరికీ తెలియకుండా జానకి చదువుకుంటున్న మాట్లాడవ్ ఏంట్రా అని అంటాడు.

Janaki Kalaganaledu 22nd July Today Episode : గోవిందరాజు జ్ఞానంబ దగ్గరనుంచి జానకి సర్టిఫికెట్స్ తీసుకొస్తాడా…

Janaki Kalaganaledu 22nd July Today Episode
Janaki Kalaganaledu 22nd July Today Episode

అవును నాన్న నేనే చదివిస్తున్నాను నాన్న అని అంటాడు రామా, నీకు మతుండే చేస్తున్నావా రా, మీ అమ్మ వాళ్ళ తమ్ముడికి చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే తన అలా అయ్యాడని నీకు కూడా ఎక్కడ అలా అవుతుందని, నీకంటే తక్కువ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేయాలి, అని అనుకుంది. జానకి డిగ్రీ చదివినప్పుడు మీ అమ్మకి గుండె ఆగినంత పని అయింది. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ భయపడుతూ బతికింది రా మీ అమ్మ దేవుడి దయవల్ల జానకి మంచితనం అర్థం చేసుకుంది రా , మీ ఇద్దరూ కలిసి బ్రతకడానికి ఒప్పుకుంది.

అలాంటిది నువ్వే మళ్ళీ చదివిస్తున్నామని మీ అమ్మకు తెలిస్తే తట్టుకోగలదా, తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం ఏంటి అర్థం లేకుండా, అని గోవిందరాజు అంటాడు. తను బ్రతికినంత కాలం కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నాన్న, పెళ్లి అనేది ప్రతి ఆడపిల్లకి ఒక అందమైన కల నాన్న కానీ తన జీవితానికి మాత్రం పెద్ద శాపంగా మారింది. ఐపీఎస్ అవ్వాలని తన చిన్ననాటి కల ని బలితీసుకుంది. కన్నవాళ్ళ ఆత్మకి శాంతి లేకుండా చేసింది నాన్న, మనం ఒక చిన్న వస్తువును కోల్పోతేనే చాలా బాధపడుతుంటాం.

అలాంటిది తనకి ఐపీఎస్ ఒక కల నాన్న అది దూరమైతే అయితే తట్టుకోగలగి బ్రతకగలదా, నా భార్య నాతో నడిచిన ఏడడుగులు తనకి నరకం కాకూడదని నేను ఇలా చేశాను నాన్న, అది కాదురా రాముడు జానకి మీద మీ అమ్మ ఎంతో నమ్మకం పెట్టుకుంది. రా ఈ విషయం తెలిస్తే తను, గోవిందరాజు అంటాడు. ఇందులో జానకి తప్పేం లేదు నాన్న, తను అమ్మకిచ్చిన మాట ప్రకారమే నేను చదువు మానేస్తాను అని అన్నది నాన్న కానీ నేనే తన కళ నెరవేర్చాలి అని తనని బలవంతంగా చదివిస్తున్నాను, నాన్న, జానకి ఏడుస్తూ ఉంటుంది.

నాన్న జానకి గారు కచ్చితంగా ఐపీఎస్ అయ్యి తీరుతుంది. నాన్న, జానకి గారి చదువు కాగితాలు అమ్మ దగ్గర ఉండి పోవడం వల్ల ఇప్పుడు సమస్యలు ఎదురయ్యేలా ఉన్నాయి కాబట్టి ఆ కాయితాలు నువ్వే తీసుకురావాలి. నాన్న అని రెండు చేతులు పట్టుకొని బ్రతుమిలాడుతాడు. దయచేసి ప్రయత్నించు, నువ్వే ఎలాగైనా ఇప్పించిన అన్న ప్లీజ్ ప్లీజ్ నాన్న అని బ్రతిమిలాడతాడు, అలాగే రా మీ అమ్మతో మాట్లాడి ఏదో ఒకలాగా నేను ఆ కాగితాలు వచ్చేలా చేస్తాను, అని అంటాడు. జానకి, రామ చాలా సంతోష పడతారు, జానకి చదువు కాగితాల గురించి జ్ఞానాన్ని ఎలా అడగాలో అర్థం కావట్లేదు, అని ఆలోచిస్తూ ఉంటాడు. జ్ఞానం బా ఏవండీ మీకు ఒక విషయం తెలుసా.

గీత అనే అమ్మాయిని వాళ్ళ అమ్మానాన్న మన ఇంటికి తీసుకువచ్చారు. తను అత్తగారింటికి వెళ్ళను అంటుంటే నన్ను నచ్చ చెప్పమని తీసుకొచ్చారండి. అయితే నేను జానకి చదువు గురించి నాకు ఇచ్చిన మాట కోసం తను ఎంతలా కట్టుబడి ఉందో, అర్థం అయ్యేలా చెప్పానండి. తాను అది విని అర్థం చేసుకొని మారతాను, అని అత్తగారింటికి వెళ్తానని చెప్పింది. అని అంటుంది జ్ఞానం, గోవిందరాజు జ్ఞానం జానకి నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది కదా. మరి నీకెందుకు తనమీద నమ్మకం లేదు, అదేంటండి అలా అడిగారు జానకి మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంటి బంగారం లాంటి పిల్ల తను తన మీద ఎప్పటికీ నమ్మకం ఉంటుంది.

అని అంటుంది జ్ఞానంబ, నిజంగా తన మీద నమ్మకం ఉంటే జానకి చదువు కవితలు నీ దగ్గర పెట్టుకో కదా జ్ఞానం ఆ రోజంటే నువ్వు భయం కొద్దిగా తీసుకున్నావు. కానీ తన మీద నీకు పూర్తిగా నమ్మకం వచ్చింది కదా. తన చదువు కాగితాలన్ని తిరిగి చేయొచ్చు కదా జ్ఞానం, లేదంటే తనకి నామీద ఇంకా నమ్మకం లేదు అని బాధపడుతుంది. కదా జానకి, గోవిందరాజు అంటాడు. అప్పుడు జ్ఞానం అవునండి నేను ఈ విషయం గురించి అసలు ఆలోచించని ఆలోచించలేదు, పాపం నిజంగానే జానకి బాధపడి ఉంటుంది కదండి.

అంతే కదా జ్ఞానం జానకి తన చదువు కాగితాలన్ని ఇచ్చేయ్, తనని ఎంతగా నమ్ముతున్నావో అర్థమయ్యే తను చాలా సంతోషపడుతుంది జ్ఞానం అని అంటాడు గోవిందరాజు, అలాగేనండి ఇచ్చేస్తానండి, ఇచ్చే జ్ఞానం ఇంకెందుకు ఆలస్యం, కానీ ఇప్పుడు కాదండి జానకి నేలతప్పింది అనే విశేషం చెప్పగానే అప్పుడు ఆ కాగితాలను తన చేతిలో పెడతానండి, అని జ్ఞానాంబ అంటుంది. అప్పుడు గోవిందరాజు అబ్బా అది కాదు జ్ఞానం, దానికి దీనికి సంబంధం ఏంటి అంటాడు.

జానకి నాకు ఆ శుభవార్త చెప్పినప్పుడు తన కళ్ళల్లో ఆనందాన్ని చూసి నేను బహుమతిగా కాగితాన్ని ఇస్తానండి, అప్పుడు జానకి కూడా చాలా సంతోషపడుతుంది. అయినా వాటితో జానకి కి ఇప్పుడు అవసరమేముందండి. అని జ్ఞానంభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గోవిందరాజు చేతికి వచ్చినట్టే వచ్చి చేయిజారి పోయింది అని బాధపడుతూ ఉంటాడు. రామ, జానకి కంగారుపడుతూ ఉంటారు. జానకి చదువు కాగితాలు తీసుకొస్తాడా తీసుకురాడా అని కంగారుపడుతూ ఉంటారు ఇద్దరు, అంతలో గోవిందరాజు వస్తాడు.

అప్పుడు రామ కంగారుపడుతూ ఏమైంది నాన్న ఇచ్చిందా అమ్మ జానకి చదువు కాగితాలు, అప్పుడు గోవిందరాజు ఇస్తానంది కానీ ఇప్పుడు కాదు జానకి కడుపు పండినప్పుడు, అది కాదు నాన్న ఇప్పుడు జానకి కాగితాలు కాలేజీలో ఇవ్వకపోతే తనని రేపటి నుంచి కాలేజీకి రానివ్వరు నాన్న, నువ్వు ఆ మాట అంటుంటే నాకు ఊపిరి ఆడట్లేదు నాన్న అని రామా అంటారు, ఆ మాట నరకం కంటే భయంకరంగా ఉంటుంది నాన్న, ఇంకొకసారి అమ్మని కాగితాలు అడిగితే అమ్మకి అనుమానం వస్తుంది.

ఒకపక్క కాగితాలు లేకపోతే చదువు ఆగిపోతుంది ఎలా అని కంగారుకి ప్రాణం పోతున్నట్లు ఉంది నాన్న అని కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో గోవిందరాజు ఒరేయ్ రాముడు ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. మరేం కంగారు పడకండి. నేను ఇప్పుడే వస్తాను ఆగండి, అని గోవిందరాజు బీరువా తాళం తీసుకొస్తాడు. ఈ సమస్యకు పరిష్కారం ఇదేరా అని తాళం చూపిస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ మల్లికా కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం వరకు ఎదురుచూడాల్సిందే.