Janaki Kalaganaledu 28 July Today Episode 354 : రామ ఆత్మహత్య చేసుకుంటాడా… జ్ఞానంబ తనని ఆపుతుందా…

Janaki Kalaganaledu 28 July Today Episode 354 : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది 28 గురువారం  హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… జానకి చదువు గురించి జ్ఞానం, రామ మాట్లాడుకుంటూ ఉంటారు. రామ అమ్మ నీకు ఇచ్చిన మాట మూలంగానే నేను జానకిని చదివిస్తున్నానమ్మా అంటాడు. నాకు ఇచ్చిన మాట జ్ఞానంబ అని అంటుంది. అవునమ్మా నువ్వు భార్యని ఎప్పుడూ కంటతడి పెట్టించొద్దు ఆమె కోరికలు ఏంటో తెలుసుకొని నెరవేర్చాలి. బాధ్యతగా నిర్వర్తించాలి అని చెప్పావమ్మా అందుకోసమే తన ఐపీఎస్ కలను నేను నెరవేర్చాలి అని అనుకున్నాను.

నేను భార్యని మంచిగా చూసుకోమని చెప్పాను. రా చదివించమని కాదు చెప్పింది. నువ్వు అంత బాధ్యతగా నిర్వర్తించే వాడివైతే జానకి నీ చదివిస్తున్న సంగతి నాకు చెప్పేవాడు రా.. నీ అమ్మతో నువ్వు ఆడుకున్నావురా.. జానకి అత్తయ్య గారు చాలాసార్లు మీకు చెప్పాలి అని అనుకున్నాను కానీ పరిస్థితులు అనుకూలించలేదు అని అంటుంది.. నువ్వు మాట్లాడకు నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు నువ్వు మాట్లాడకు అని అంటుంది. రామ నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని భయమేసి నీకు చెప్పలేదు అమ్మ… నా కొడుకు నన్ను ఎప్పుడు మోసం చేయడు అనుకున్నాను రా.. కానీ ఇంత మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు..

Janaki Kalaganaledu 26 July Today Episode 354 : రామ ఆత్మహత్య చేసుకుంటాడా… జ్ఞానంబ తనని ఆపుతుందా…

Janaki Kalaganaledu 26 July Today Episode 354
Janaki Kalaganaledu 26 July Today Episode 354

నువ్వు కూడా అందరిలాగే, జానకి అత్తయ్య గారు మీ అబ్బాయి లో ఎటువంటి ప్రాబ్లం లేదండి మీ పెంపకంలో ఎటువంటి సమస్య లేదండి… మీకంటే ఎవరూ ముఖ్యం కాదు… అసలు వాడు ఇలా నా మాట వినకుండా ఇవన్నీ చేయడానికి కారణం అంతా నువ్వే, అమ్మ అది కాదు అమ్మ .. నువ్వు నన్ను అలా పిలవకు అమ్మ అని పిలవకు అమ్మ అనే అర్ధానికి విలువ లేకుండా చేశావురా…. నువ్వు నా కడుపున పుట్టడం ఒక వరం అని సంతోషించాను… కానీ ఇప్పుడు నువ్వు నా కడుపున పుట్టకపోయి ఉంటే బాగుండు అనిపిస్తుంది రా…. అమ్మ ఏమన్నా నేను నీ కడుపున పుట్టకపోయి ఉంటే బాగుండా ఆ మాట అన్నప్పుడే నా ప్రాణం పోయింది అమ్మ.

నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా మళ్లీ జన్మంటూ ఉంటే నీ రుణం తీర్చుకుంటానమ్మ… అని తన కాళ్ళ మీద పడబోతుంటే తను ఒప్పుకోదు… జానకి గారు మీకే మంచి భర్తవుదాం అనుకున్నాను కానీ మీకు బాధని మిగిల్చి వెళ్ళిపోతున్నాను క్షమించండి… రామ నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళిపోతుంటాడు… జానకి ఆపాలని ట్రై చేస్తుంది.. కానీ తన మాట వినడు.. జానకి జ్ఞానంబ దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడుతుంది. అత్తయ్య గారు మీరైనా ఆపండి అని.. కానీ తన మాట వినదు.. జానకి చావైన బ్రతుకైనా నీతోనే అంటూ తను కూడా తనతో పాటు వెళ్లిపోతుంటే..

అప్పుడు జ్ఞానాంబ రామ ఎన్కిరా.. అని పిలుస్తుంది. అప్పుడు రామ నీళ్లలో నుంచి బయటికి వచ్చేస్తాడు… కట్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. కానీ మల్లికా తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. జ్ఞానంభ, జానకి రామ ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు.. జ్ఞానంబా రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకుంటుంది.. గోవిందరాజు తనని పిలుస్తూ ఉంటాడు డోరు కొడుతు , అప్పుడు తను బయటికి వచ్చి మీరు భయపడకండి.. నేను చచ్చిపోయేంత పిరికిదానైతే కాదు అని మళ్లీ వెళ్ళిపోతుంది.. అందరూ బాధపడుతూ ఉంటారు..

కానీ మల్లికా మాత్రం రూమ్ లోకి వచ్చి పాటలు పాడుతూ… డాన్స్ వేసుకుంటూ తెగ సంతోష పడిపోతూ ఉంటుంది.. విష్ణు నువ్వు అసలు మనిషివేనా బయట ఎలాంటి పరిస్థితి ఉంది. నువ్వు చేసేది ఏంటి అని తిడుతుంటాడు… జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అని తెగ సంతోష పడిపోతూ ఉంటుంది మల్లిక… అందరూ కంగారు పడుతూ ఉంటారు ఏమంటుందో ఏంటో జ్ఞానం బా అని.. అంతలో జ్ఞానం బయటికి వస్తుంది… తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే….