Janaki Kalaganaledu 29 July Today Episode 355 : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇంతకుముందు జానకి తన చదువు గురించి చెప్పాలనుకున్న సిచువేషన్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. జానకి అత్తయ్య గారు తనంతట తాను తెలుసుకోవడం వల్ల తనని మనం మోసం చేశామని మనం చెప్పకుండా తను తెలుసుకోవడం వల్ల మనం క్షమించమని అడగడానికి కూడా ఛాన్స్ లేదు… అని ఇద్దరు దాని గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో గోవిందరాజు వాళ్ల దగ్గరికి వస్తాడు. గోవిందరాజు వాళ్ళిద్దరికీ మీరు దాని గురించి ఆలోచిస్తున్నార..
అది మీకు ఒక పరీక్ష లాంటిది అనుకోండి దాంట్లో ఎలా నెగ్గాలో ఆలోచించండి దానిని ఇక మర్చిపోండి అని అంటాడు… అప్పుడు రామ ఎంత మర్చిపోవడానికి ట్రై చేసినా మర్చిపోలేక పోతున్నాను… నాన్న , అమ్మ మొహంలో ఎప్పుడైతే చిరునవ్వు చూస్తాను ఆ క్షణం మా బాధ పోతుంది.. మీ అమ్మ లో ప్రేమించే గుణం ఎంతుందో.. అంతే క్షమించే గుణం కూడా ఉంటుంది. మీ అమ్మ రేపు వరలక్ష్మి వ్రతానికి సిద్ధం చేయమంది కదా… ఆ తల్లి అన్ని విషయాలు చక్కపడేలా చేస్తుంది.. నీ మనసులో ఎలాంటి బాధలు పెట్టుకోకుండా వరలక్ష్మీ వ్రతం మనస్ఫూర్తిగా చేయండి ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మీ అమ్మ మనసు మారుస్తుంది…
Janaki Kalaganaledu 29 July Today Episode 355 : జ్ఞానాంబ జానకి వరలక్ష్మి వ్రతం చేయడానికి ఒప్పుకుంటుందా… రామ, జానకి నీ క్షమిస్తుందా…

కట్ చేస్తే జానకి రామ ఇల్లంతా అలంకరిస్తూ ఉంటారు. జ్ఞానంబ లో ఎలాగైనా మార్పు రావాలి వరలక్ష్మి వ్రతం తర్వాత అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. అంతలో జ్ఞానంబ అందరికీ బట్టలు తీసుకొని అక్కడికి వస్తుంది. ఇంట్లో వాళ్లందర్నీ పిలుస్తుంది. కానీ జానకి రామ వాళ్ళతో మాత్రం మాట్లాడరు… కానీ మల్లికా ఇంకా నిద్ర లేవదు.. విష్ణుని వెళ్లి మామిడి తోరణాలు కట్టు అని గట్టిగా చెప్తుంది. అప్పుడు విష్ణు అన్నయ్య కడుతున్నాడు కదా అని అంటాడు.. కానీ జ్ఞానం బా నేను చెప్పాను కదా కట్టమని వెళ్లి కట్టు అని గట్టిగా అంటుంది. మల్లికాని పిలిచి ఇన్ డైరెక్ట్ గా జానకిని తిడుతూ ఉంటుంది. ఒక మాట ఇస్తే ప్రాణం పోయినా అంతవరకు ఆ మాట తప్పకుండా ఉండాలి…
అంటూ జ్ఞానాంబ ఇన్ డైరెక్ట్ గా జానకిని మాటలు అంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం కార్యక్రమం అంతా నీ చేతుల మీదుగా జరిపించాలి.. కాళ్లకు పసుపు రాసి దగ్గర నుంచి అందరికీ వాయినాలు ఇచ్చేవరకు అంత నువ్వే చూసుకోవాలి అని మల్లిక ను అంటుంది.. అప్పుడు మల్లికా సంతోషంతో పొంగిపోతూ నేను చేస్తాను.. అత్తయ్య గారు మీ మాట జవదాట నో అత్తయ్య గారును అని డ్రామాలు వేస్తూ ఉంటుంది.. అరే విష్ణు అఖిల్ మీరిద్దరూ మిగతాది చూసుకోండి… అమ్మంటే అడుగడుగునా ఆడుకునే బొమ్మల చూడకండి.. బాధ పెట్టకండి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి… అని ఇండైరెక్టుగా రామాను అని అంటుంది. తర్వాత ఏం జరిగింది. తెలియాలంటే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే…