Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ‘ అర్జున్ రెడ్డి ‘ సినిమాతో ఒక్కసారి ఐకాన్ స్టార్ గా మారిపోయారు. అంతకుముందు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన అంత గుర్తింపు రాలేదు. కానీ ఈ యొక్క సినిమాతో తను బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ‘లైగర్ ‘ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ లైగర్ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారని మనందరికీ తెలిసిందే. దీని భాగంగా బాలీవుడ్ లో ‘ లైగర్ ‘ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.
కరణ్ జోహార్ స్వయంగా ‘ లైగర్ ‘ సినిమాను హిందీలో విడుదల చేయబోతున్నారని తెలిసిందే. అందుకే భారీ ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలను డిజైన్ చేశాడు కరణ్. అందుకు తగ్గట్లుగా విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు మరింతగా ట్రావెల్ అయ్యేందుకు కరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. కరణ్ జోహార్ ఒక స్టార్ తో సినిమాలు చేశాడంటే మళ్ళీ మళ్ళీ చేస్తాడని బాలీవుడ్ లో ఓ టాక్ ఉంది.
Vijay Devarakonda : మన రౌడీ స్టార్ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఏంటి ఆయన..

విజయ్ దేవరకొండ మరియు కరణ్ జోహార్ల మధ్య మంచి అనుబంధం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అందుకే తెలుగు హీరో అయినా కూడా కరణ్ జోహార్ వరుసగా తమ సంస్థలో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. గతంలో ఎంతోమంది హీరోలతో వరుసగా సినిమాలను చేసి స్టార్స్ ను చేసిన ఘనత కరణ్ జోహార్ కి ఉంది. అందుకే కరణ్ జోహార్ ని స్టార్ మేకర్ అంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆయన కంపెనీలో పడ్డాడు. ముందు ముందు కూడా వరుసగా మన రౌడీ స్టార్తో కరణ్ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. దీనివల్ల విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు అంటున్నారు.