Karthika Deepam 12 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదలైంది. 12 శుక్రవారం ఎపిసోడ్ 1429 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… చిన్ననాటి జ్ఞాపకాన్ని శౌర్యకు గుర్తుచేస్తుంది. నీకోసం మేము రాలేదా నువ్వే మొండిగా చేశావు అని అంటుంది. అప్పుడు సౌర్య నేను ఇప్పుడు కూడా అంతే ఏదో మీ ఇంట్లో ఉంటున్నా అంటే ఉంటున్న అంతే అని అంటుంది. అంతలో అక్కడికి హిమ ఆనందరావు వస్తారు హిమ శౌర్యను ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. నాకెంత హక్కు ఉందో నీకు కూడా అలాగే శౌర్య అని చెప్తుంది. చాల్లే ఆపు నీ నాటకాలు అని అంటుంది. ఈ ఇంటి మీద నాకెంత బాధ్యత ఉందో నీకు కూడా అంతే బాధ్యత ఉంది అని అంటుంది. అప్పుడు సౌర్య తెలుస్తున్నాయి నీ బాధ్యతలు అని అంటుంది. అప్పుడు హిమ ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా విను నీ పెళ్లి ఎలాగైనా జరిపిస్తాను అని అంటుంది.
కట్ చేస్తే స్వప్న పెళ్లి బాధ్యతలను ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ప్రేమ్ హిమ ప్రేమ గురించి ఫోన్లో ఉన్న వీడియో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి నిరూపం, సత్యం, స్వప్న వస్తారు. తన ఫోన్ ని లాక్కొని నువ్వు దీనిలో ఏం దాచి పెట్టావ్ రా అని అంటాడు. అలాంటిది ఏం లేదురా అని అంటాడు ప్రేమ్. సరేలే గాని ఈ పెళ్లి గ్రాండ్గా జరిగేలా నువ్వు చూడాలి అని ముగ్గురు చెప్తారు. అప్పుడు ప్రేమ్, హిమ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్లు ప్రేమ్ ఏదో దాస్తున్నాడు. చాలా రోజులు నుంచి మూడీగా ఉంటున్నాడు అని అనుకుంటారు. కట్ చేస్తే స్వప్న అందరికీ బట్టలు తీసుకుని వస్తుంది. సౌర్య నీక్కూడా చాలా చీరలు తీసుకొచ్చాను అని అంటుంది. అప్పుడు శౌర్య ఎందుకు నామీద ఒకళ్ళు ప్రేమ వాళ్ళకపోస్తున్నారు. ఒక జాలినీ ను చూపిస్తున్నారు. ఇంకొకరు శాడిజం చూపిస్తున్నారు. నాకు బట్టలు లేవని మీకు చెప్పానా అని అంటుంది. ఈ నాటకాలు నేను చూడలేకపోతున్నాను.
Karthika Deepam 12 August 2022 Episode : ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి అని చూస్తున్న హిమ…
ఈ పెళ్లి జరిగిన మరుక్షణం నేను నా దారి చూసుకుంటాను అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ప్రేమ్ దగ్గర నిరూపం ఏమైంది ఎవరైనా ప్రేమించావా నాకు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ హిమని ఇద్దరం ఇష్టపడ్డాం రా నీకు అది ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ మనసులో అనుకుంటాడు. ఇక్కడ హిమ సౌర్యాని మనం స్నేహితుల ఉండొచ్చు కదా.. అని అంటుంది. అది ఎప్పటికీ జరగదు అని అంటుంది శౌర్య. హిమ నిరుపం బావని ఇద్దరం ఇష్టపడ్డాం. కానీ నీకోసం నేను త్యాగం చేస్తున్నాను అది నీకు అర్థం కావడం లేదు అని హిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సౌర్య ఇక వెళ్ళు ఇక్కడనుంచి అని అంటుంది. కట్ చేస్తే సౌర్య కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఆనందరావు అక్కడికి వెళ్లి అమ్మ బంగారం అని పిలుస్తూ ఉంటాడు. నన్ను అలా పిలవద్దు తాతయ్య అని అంటుంది. నువ్వు బంగారం ఏరా నువ్వు వచ్చిన ఎలా విశేషం అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి.
మీ స్వప్నత్త అందరితో కలిసిపోయింది అని అంటాడు. మీ స్వప్న అత్త లాగా నువ్వు కూడా హిమతో కలిసి పోరాదు అని అనగానే సౌర్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. నా మనవరాలు ఎప్పుడూ మారుతుందో అని ఆనందరావు అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే హిమ, శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సౌందర్య హిమ దగ్గరికి వచ్చి చీరను తీసుకొచ్చి ఇచ్చి తొందరగా రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు హిమ బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటావు తొందరగా వెళ్ళు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చి హిమను పిలుస్తాడు. అప్పుడు ప్రేమ్ హిమ ఈ పెళ్లి కార్యక్రమాలు అన్ని అయిపోతున్నాయి ఎలా బావ అని అంటుంది హిమ. అప్పుడు ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్లు ఇద్దరూ కలిసి ఈ పెళ్లి ఆపడానికి గురించి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.