Karthika Deepam 17 August 2022 Episode :బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఈరోజు ఎపిసోడ్ 1433 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఆ పెద్దావిడ దీపకు ధైర్యం చెబుతూ ఉంటుంది. ఆ పెద్దావిడ వంట చేయమని రాంపండులని పిలుస్తుంది. అప్పుడు ఏం చేయమంటావమ్మా చికెన్, గారెలు ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమంటావా అని వాళ్ళు అంటారు. అప్పుడు మా మొహాలకి స్పెషల్ కూడానా ఏదో మాకు గతిలేక మీ వంటలు తింటున్నాం. అని అంటుంది. అప్పుడు దీప వంటగది ఎక్కడమ్మా నేను చేస్తాను. వంట అని చెప్పి వంట చేయడానికి వెళుతుంది. కట్ చేస్తే సౌర్య, బాబాయి పిన్నులు సౌర్యని ఓదారుస్తూ ఉంటారు. మేము పొట్టకూటి కోసం ఏదో దొంగతనాలు చేసుకుంటూ బ్రతికి వాళ్ళం ఆ డబ్బులు పెట్టి సాదాలి అంటే కష్టంగా తల్లి నువ్వు పెద్ద ఇంటి బిడ్డవి నువ్వు అక్కడ ఉండటమే మంచిది.
Karthika Deepam 17 August 2022 Episode : కొన్ని సంవత్సరాలు గతమంతా చెప్తున్నా వారణాసి..
అని నచ్చ చెప్తు ఉంటారు. మీ అమ్మానాన్నలు దూరమై నువ్వు ఎంత బాధ పడుతున్నావ్ కదా.. నువ్వు దూరమైనందుకు మీ నాయనమ్మ, తాతయ్యలు బాధపడరా అమ్మ ఒక్కసారి ఆలోచించు అని నా కూతురు కూడా చిన్నప్పుడు ఇలాగే అలిగి వెళ్లిపోయింది. తనకోసం ఇప్పటికీ నేను ఎంతో బాధపడుతూ ఉంటాను అని చెప్తుండగా… సరే అని అంటుంది శౌర్య. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంట్లో దీప చేసిన వంట తినుకుంటూ ఇంత అద్భుతమైన వంట ఏనాడు తినలేదు. అని దీపను పొగుడుతూ ఉంటారు. మీరు మరీ ఎక్కువగా పొగుడుతున్నారమ్మా అని అంటుంది దీప. వీళ్ళు చేసిన వంటలు తిని తిని నోరు సప్పబడిపోయింది అమ్మ. నీ చేతి వంట తినగానే ఊపిరి ఒక్కసారిగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. తల్లి అని అంటుంది పెద్దావిడ.
అప్పుడు దీప కార్తీక్ ను గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్, వాళ్ళ అమ్మ ధైర్యం చెప్తారు. సరే అమ్మ నువ్వు రేపు హైదరాబాద్ వెళ్ళు అని అంటాడు డాక్టర్. అప్పుడు వెళ్తాను వెళ్లి పిల్లలు తీసుకొని వచ్చి డాక్టర్ బాబుని వెతుకుతాను.. అని అంటుంది. నేను కూడా ఇక్కడ వెతుకుతానులే అని డాక్టర్ అంటాడు. దీప చేసిన వంటను మళ్లీ మళ్లీ వేయించుకొని అందరూ కడుపునిండా తింటారు. కట్ చేస్తే దీప హైదరాబాదుకు వెళుతూ ఉంటూ పిల్లల గురించి సౌందర్య, ఆనంద్ రావుల గురించి బాధపడుతూ ఆలోచిస్తూ వెళుతూ ఉంటుంది. కట్ చేసే సౌర్యను తీసుకొని వాళ్ల పిన్ని బాబాయ్ లు కూడా హైదరాబాదుకి వస్తూ ఉంటారు. హైదరాబాద్ పోవడానికి ఒక్కటే బస్సు లో దీప, శౌర్య, వాళ్ల బాబాయి పిన్నులు వెళుతూ ఉంటారు. కానీ ఒకరిని ఒకరు చూసుకోరు. కట్ చేస్తే సౌందర్య వాళ్లు అమెరికా వెళ్లిపోవడానికి దీపా కార్తికల ఫోటోలను చూస్తూ బాధపడుతూ ఉంటుంది అన్ని సర్దుతూ ఉంటుంది. హిమ ఆనంద్ రావు సౌందర్య వారి ఫోటోలు చూసి ఒక్కటే బాధపడుతూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.