Karthika Deepam 24 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే 24-08-2022 సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1439 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీప పార్కు లో కార్తీక్ ఫోటోను చూపిస్తూ వెతుకుతూ ఉంటుంది. అంతలో అక్కడికి మోనిత వచ్చి ఆమె కూడా కార్తీక్ ఫోటోను చూపించి కార్తీక్ వివరాలను అడుగుతూ ఉంటుంది. దీప ఎవరికి కనిపించలేదు అంటున్నారు అని బాధపడుతూ ఉండగా మౌనిత దీప దగ్గరకు వచ్చి కార్తీక్ ఫోటోను చూపిస్తుంది. అప్పుడు దీప ఆశ్చర్యంగా చూస్తూ తనతో ఘర్షణ పడుతుంది. అప్పుడు మౌనిత నువ్వు బ్రతికే ఉన్నావు అంటే కార్తీక్ కూడా బ్రతికి ఉన్నాడు అని సంతోషపడుతూ తెగ డ్రామాలు వేస్తూ ఉంటుంది. అప్పుడు దీప ఇక నీ డ్రామాలు ఆపవే డాక్టర్ బాబు ఎక్కడ దాచావో చెప్పు అని అంటుంది దీప.
Karthika Deepam 24 August Today Episode : కార్తీక్ ఫోటోను చూపిస్తూ వెతుకుతూ డ్రామాలాడుతున్న మోనిత…
అయినా సరే మౌనిత ఏమీ తెలియనట్లుగా డ్రామాలు ఆడుతూనే ఉంటుంది. ఏడుస్తూ కార్తీక్ ఫోటోను చూస్తూ బాధపడుతూ అందరినీ అడుగుతూ ఉంటుంది. దీప అప్పుడు ఎవరు తీసుకెళ్లారు ఇంకా అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే హిమ కార్తీక్ దీప ల ఫోటోలను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి సౌందర్య వచ్చి హిమాని ఓదారుస్తూ వాళ్ళు ఎప్పటికీ రారు హిమ నువ్వు ఎన్ని రోజులు అంటూ ఆలా ఏడుస్తావు అని. అప్పుడు వాళ్లు రారు.. నాయనమ్మ కానీ శౌర్య వస్తుంది కదా… నన్ను ఇక్కడ నువ్వు ఓదారుస్తున్నావ్.. తనని ఎవరూ ఓదారుస్తారు. తను ఎంత బాధ పడుతుందో అని అంటుంది. అప్పుడు హిమా నీ ఆలోచనలు మానేయాలి. ఇలా బాధపడడం కూడా నువ్వు ఆపేయాలి అని సౌందర్య అంటుంది. అప్పుడు ఆనందరావు వచ్చి ఎలా చెప్తున్నావు సౌందర్య తనని మర్చిపోమని, నువ్వు మర్చిపోయావా నేను మర్చిపోయాను…

తనను నేను శౌర్య దగ్గరికి తీసుకెళ్తాను. అని చెప్తాడు. అప్పుడు సౌందర్య శౌర్య గురించి మీ అందరికంటే నాకే ఎక్కువ తెలుసు అది కోపం తగ్గే వరకు రాదు.. దానికి రావాలనిపించినప్పుడు వస్తుంది అని అంటుంది. కట్ చేస్తే.. కార్తీక్ శివ కలిసి బయటికి వస్తారు. కార్తీక్ శివతో మీ మేడం ఏంటయ్యా నాతో ఆడుకుంటుంది. నేను భరించలేకపోతున్నా అని అంటుండగా.. శివా కి ఫోన్ చేసి వచ్చేయండి అని చెబుతుంది. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే సౌందర్య, శౌర్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ ఫోటో వైపు చూస్తూ నీ కూతుర్లే నేను సరిగా చూసుకోలేక పోతున్నాను సౌర్యాని నేను తెచ్చుకోలేక పోతున్నాను. మీ ఆత్మలకి నేను శాంతి చేకూర్చలేకపోతున్నాను రా.. అని బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…