Karthika Deepam 4 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 1449 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌర్య వారణాసిని ఫోటోలు సంగతి ఏం చేసావ్ వాటిని పోస్టర్లుగా అంటించి అమ్మానాన్నలు వెతుకుదాం అని అంటుంది. అప్పుడు వారణాసి నా ఫోన్లో ఫోటోలు డిలీట్ అయ్యాయి.. అమ్మ అని అంటాడు. అప్పుడు సౌర్య ఇప్పుడు ఎలా వారణాసి అని బాధపడుతూ ఉండగా. అయ్యగారికి ఫోన్ చేసి పెట్టమని చెప్తాం అని అంటాడు వారణాసి. అప్పుడు సౌర్య వద్దు.. అని కోపంగా వాళ్లకి నేను ఇక్కడ ఉన్న సంగతి తెలియదు. వాళ్లకి తెలిస్తే పదేపదే ఇక్కడికి వస్తారు. నన్ను రమ్మంటూ అడుగుతారు.. నేను రాను అంటాను.. ఇదంతా వద్దు అని వారణాసికి చెప్తుంది. అప్పుడు వారణాసి నీకు వాళ్ల మీద కోపం ఎప్పుడు పోతుందమ్మా… ఆ ఇంటికి ఎప్పుడు వెళ్తావ్ అమ్మ అని అడుగుతాడు.
Karthika Deepam 4 September Today Episode : నా భార్య ని చంపాలని చూస్తున్నావా అంటున్న కార్తీక్….
అప్పుడు మా అమ్మానాన్న నాకు కనిపించినప్పుడు వాళ్లతో కలిసి వెళ్తా అప్పుడు హిమ మీద కోపం కూడా నాకు పోతుంది అని చెప్తుంది. కట్ చేస్తే దీప కూరగాయలు తీసుకుని వెళ్లి వంట చేసుకుంటూ కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత దీపని ఎలాగైనా కార్తీక్ పంపించేలా చేయాలని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అది ఇక్కడే ఉంటే నాకు కార్తీక్ ని నాకు దూరం చేస్తుంది. ఏదో ఒకటి చేసి దాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి.. అని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అంతలో దీప భోజనం తీసుకుని వచ్చి కార్తీక్ కి మౌనితకి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్లు తింటూ మౌనిత ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఒక్కసారిగా కంగారుపడుతూ ఏమైంది అని మోనిత దగ్గరికి వెళ్లి తనను తీసుకెళ్లి ఒక దగ్గర కూర్చోబెట్టి కంగారు పడుతూ ఉంటాడు. శివాని పిలిచి డాక్టర్ని తీసుకు రమ్మని చెప్తాడు. ఇదంతా చూసిన దీప బాధపడుతూ.. చూడలేక తను ఇంట్లో నుంచి బయటికి వెళుతుంది.

తర్వాత డాక్టర్ వచ్చి మౌనితను చూసి ఈమెకి తిన్న ఫుడ్ వల్ల వాంతులు అయ్యాయి ఆ ఫుడ్ లో ఏదో కలిసింది అని చెప్తాడు. ఆ విధంగా చెప్పమని మౌనిత ముందే డాక్టర్ కి ఫోన్ చేసి చెప్తుంది.అప్పుడు మౌనిత ఇక డ్రామా స్టార్ట్ చేసి ఏడుస్తూ… ఆ వంటలక్క నన్ను చంపాలని చూస్తుంది కార్తీక్ అని అంటుంది. అప్పుడు కార్తీక్ నిన్ను ఎందుకు చంపాలని చూస్తుంది. అని అంటాడు. అప్పుడు మౌనిత నన్ను చంపేసి నిన్ను దాని సొంతం చేసుకోవచ్చని ఇన్న్ని ప్లాన్లు వేస్తుంది. అని పెద్ద డ్రామా ఆడుతుంది. అప్పుడు కార్తీక్ అదంతా నమ్మి దీప మీద కోపంతో తన దగ్గరికి వెళ్లి నువ్వు అసలు ఏమనుకుంటున్నావ్ నా భార్యని విషం పెట్టి చంపేద్దామనుకుంటున్నావా.. తనని చంపితే నీకేం వస్తుంది నన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావా.. నాకు పెళ్లయింది. నాకు భార్య ఉంది. ఒక పెళ్లయిన మగవాడి మీద పరాయి మహిళ ఆశపడకూడదు.. ఆ విషయం నీకు తెలియదా అనిత అని తిడుతూ ఉంటాడు. అప్పుడు దీప ఏడుస్తూ తనకి తెలియజేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన మాట వినిపించుకోడు కార్తీక్.. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…