‘ఆదిపురుష్’లో సీత పాత్రకు కృతి సనన్ నప్పలేదా?

ప్రభాస్ రాముడి అవతారం గెటప్ పోస్టర్ లు ఈ మద్య విడల చేశాడు ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓంరౌత్. రాముడి పాత్రలో ప్రభాస్ బాగున్నాడు అనే టాక్ అప్పుడే మొదలయ్యింది. ఐతే అతని పక్కన సీతగా నటిసున్న కృతి సనన్ ఫోటోలు, వీడియో క్లిప్పులు కూడా విడుదల చేశారు. ఆదిలోనే హంస పాదు అన్నట్లు ఆమె సీత పాత్రలో నప్పలేదు అనే టాక్ మొదలయ్యింది.

Advertisement

ఆమె అందంగా లేకపోవడం దీనికి కారణం. మగాడికి చీర చుట్టినట్లు ఉంటుంది అనే టాక్ మొదటినుంచి ఉంది. ఆమె నటించిన తెలుగులో ‘దోచేయి’, మహేష్ బాబుతో నటించిన ‘నేను ఒక్కడినే’ సినిమా డిజాస్టర్ కావడానికి ఆమెనే బాధ్యురాలు అని పత్రికలు, సినిమా దర్శకుడు, సినీ అభిమానులు అన్నారు. రామాయణంలో కీలక ఘట్టమైన రావణ చెర లో ఉన్న సీతగా కృతిని చూపించడం, అలాగే ప్రభాస్ పై కూడా చిన్న పోస్టర్ లాంటిది చూపించడం ఇప్పుడు ఆమె వల్ల ఆ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేలా ఉంది.

Advertisement

ఈ మోషన్ పోస్టర్ వీడియోలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంత మాయ చేసింది అని చెప్పొచ్చు. మ్యూజికల్ పరంగా కూడా ఈ చిత్రం బాగుంది అనిపిస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో ఒకటైన “ఆదిపురుష్” పై మరింత ఆసక్తి ఏర్పడుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచె అవకాశం ఉంది.

మరి ఈ చిత్రం రిలీజ్ దగ్గరకి వస్తుండడంతో నిర్మాతలు తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తున్నారు. కానీ కృతి సనన్ ఒక్కటే వాళ్ళను భయపెడుతోంది. దీపికా పడుకొనే లాంటి అందమైన అమ్మాయి సీత పాత్ర పోషించాలి. కృతి సనన్ మాత్రం మిస్ కాస్టింగ్ అని ప్రభాస్ అభిమానులు నిర్మోహంగా చెపుతున్నారు.

Advertisement