Mahesh Babu : రానా సినిమాలో మహేష్ బాబు… ఆ సినిమా ఏంటంటే…

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యన ‘ సర్కారు వారి పాట ‘ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించినున్నట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాను పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు మరో సినిమాకు సంబంధించిన టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ పేరు మరో పాపులర్ డైరెక్టర్ సినిమాలో వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు ప్రముఖ తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

Advertisement

శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత స్పెషల్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. చాలామంది యంగ్ హీరో హీరోయిన్లను ఆయన తెలుగు వాళ్లకు పరిచయం చేశారు. అలాగే యంగ్ హీరో రానా ను కూడా తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది శేఖర్ కమ్ములనే. రానా నటించిన తొలి సినిమా ‘ లీడర్ ‘. ఈ సినిమా 2010 లో వచ్చింది అప్పట్లో ఈ సినిమా మంచి టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమాలో రానా సీఎం పాత్రలో నటించారు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి ఓ వార్త నెట్ లో వైరల్ గా మారింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత లీడర్ సినిమాకు సీక్వెల్ వస్తున్నట్లు వార్త వచ్చింది. శేఖర్ కమ్ముల లీడర్ 2 స్క్రిప్టును రెడీ చేసే పనిలో ఉన్నారని సమాచారం. అయితే ఈ సిక్వెల్ ను మహేష్ బాబుతో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత అరున గుహన్ తెలిపారు.

Advertisement

Mahesh Babu : ఆ సినిమా ఏంటంటే…

Mahesh Babu ready to do rana leader movie sequel
Mahesh Babu ready to do rana leader movie sequel

భరత్ అనే నేను సినిమా మహేష్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలో మహేష్ ని చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. మహేష్ బాబు లీడర్ 2 సినిమాకు ఓకే చెప్తే ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. మరి మహేష్ ఈ సినిమాకి ఓకే చెప్తాడో లేదో తెలియాలి. మహేష్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ ssmb28 సినిమా తర్వాత రాజమౌళితో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వాలంటే కనీసం మూడు సంవత్సరాలైనా పడుతుంది. అంతవరకు శేఖర్ కమ్ముల మహేష్ బాబు కోసం వేచి చూస్తారో లేదో చూడాలి.

Advertisement