God Father Teaser : మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ముందు రోజున అంటే ఆగస్ట్ 21 న కు టీజర్ రిలీజ్ అవుతుంది. మలయాళ చిత్రం లూసిఫర్ కు అనువాద చిత్రంగా వస్తున్న కార్డ్ ఫాదర్ ను మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా ఆర్బి చౌదరి ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ కి అభిరుచికి తగ్గట్టుగా ఆయన ఇమేజ్ను మరియు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేక ఆకర్షణ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్లుగా మనందరికీ తెలిసిందే.
ఇంకా మంచి విశేషం ఏంటంటే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కు ఒక కీలకపాత్రలో మనకు మనకు కనిపించబోతున్నాడు. ఓ ప్రత్యేక పాట లోలో సల్మాన్ ఖాన్ చిరుతో కలిసి స్టెప్పులు వేయనున్నట్లు అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాలు కూడా వీరు ఇరువురి మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించబోతున్నట్లు వార్త. అంతేకాకుండా సత్యదేవ్ ఇందులో కీలకపాత్రలో మనకు కనిపించబోతున్నారు. సుమన్ మురళీమోహన్ లాంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
God Father Teaser : మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్, టీజర్ వచ్చేసింది….
అయితే మరి గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి ఎలా ముప్పించబోతున్నాడో తెలియాలంటే ఇంకా మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా చిరంజీవి ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ కూడా చేస్తున్నారు అంతేకాకుండా బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కుర్ర హీరోలకు ఏమాత్రం స్పీడు తగ్గకుండా చిరంజీవి ఫాస్ట్ గా సినిమాలు చేసుకుంటూ మంచి జోరు మీద ఉన్నాడు.