Viral Video : ఇది కదా తల్లి ప్రేమంటే….తన పిల్ల ఎంత లేపిన లేవక పోవడంతో జూ లోని మనుషులు సహాయం అడిగిన తల్లి ఏనుగు.

Viral Video : మనం ప్రతి రోజూ నిద్రనుండి లేవటానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. నిద్రకు, ఉదయానికి మధ్య జరిగే పోరాటం మనందరం అనుభవించినదే. ఏనుగులతో సహా అన్ని జీవులకు ఇష్టమైనది నిద్ర . ఏనుగు పిల్ల మంచి నిద్రలో ఉండి తల్లి ఏనుగు ఎంత లేపినా నిద్ర లేవక పోవడం తో కంగారు పడిన తల్లి జూ లో ఉన్న మనుషుల సహాయం కోరడం వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. తల్లి ఏనుగు పిల్లని నిద్ర లేపినా లేవక పోవటం తో జూ కీపర్ ల సహాయం అడుగుతుంది.

ఈ వీడియో లో తన బిడ్డను లేపడానికి ప్రయత్నించిన తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగు ఎంత ప్రయత్నించినా నిద్ర నుండి లేవక పోవటం తో. భయాందోళనకు గురైన తల్లి సహాయం కోసం జూ లో కీపర్‌ని పిలుస్తుంది అతను మేల్కొలపడానికి పిల్ల ఏనుగును గట్టిగా కదిలించాడు. పిల్ల ఏనుగు తన కల చెదిరింది అని తన తల్లి కి ఫిర్యాదు చేస్తూ మేల్కొన్న వెంటనే తన తల్లి వద్దకు పరిగెత్తుతుంది.

Viral Video : ఇది కదా తల్లి ప్రేమంటే….

mother elephant ask help to zoo keepers to woke up her baby chub viral
mother elephant ask help to zoo keepers to woke up her baby chub viral

ఏనుగు పిల్ల నిద్ర నుండి లేవగనే తల్లి వద్దకు పరిగెత్తిన తీరు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంది మరియు ట్విట్టర్‌లో మిలియన్ల వ్యూస్ మరియు లైక్స్ పొందింది. ఈ విధంగా తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థం అవుతుంది. అది జంతువులకి అయిన మరియు మనుషులకు మధ్య అయినా. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు అందరూ తల్లి ప్రేమ మరియు మనుషుల తో అది ప్రవేతించిన తీరునందరిని ఆకర్షించింది అని అందరూ తమ కామెంట్స్ ద్వారా తెలుపుతున్నారు.