Naga Chaitanya : ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ఎవరు ఊహించని విధంగా షాక్ ఇచ్చారంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో ఉండే కొంతమంది నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా నాగచైతన్య పెళ్లి వార్తలు జోరందుకున్నాయి.ఇప్పటికే పలు సందర్భాలలో నాగచైతన్య రెండో పెళ్లి గురించి పలు వార్తలు వినిపించినప్పటికీ అవేమీ వాస్తవాలు కాలేదు. ఇక ఈసారి మాత్రం నాగార్జున అందరికీ పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడని సైలెంట్ గా తన రెండో పెళ్లి పనులను మొదలుపెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
నాగార్జున సన్నిహితులు ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఈ వార్తలు బయటకు వచ్చినట్లు ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నాగచైతన్య రెండో పెళ్లి అనే వార్త విన్న ప్రతి ఒక్కరూ టక్కున శోభిత దూదిపాలనే కావచ్చు అని అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకోబోయేది శోభిత దూదిపాలను కాదని తెలుస్తుంది. శోభితను తన కోడలిగా చేసుకోకపోవడానికి నాగార్జున కు పెద్ద కారణమే ఉందట. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన సమంతని పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీ ఇబ్బందుల పాలైంది. దీంతో మరోసారి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకోలేనని నాగార్జున భావిస్తున్నారట.
అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉండే అమ్మాయిని తన కొడుకు కు భార్యగా చేయాలని నాగార్జున చూస్తున్నారట. ఇక సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే….ఆమె ఒక బిజినెస్ మాన్ కుటుంబానికి చెందిన అమ్మాయని తెలుస్తుంది. అలాగే ఆ అమ్మాయి వారి ఫ్యామిలీ నాగార్జున ఫ్యామిలీ చాలా దగ్గర బంధువులు కావడంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఏడాది చివర్లో నాగచైతన్య అమ్మాయిని రెండో వివాహం చేసుకుంటాడని సమాచారం. మరి ఇలా వస్తున్న వార్తల పై క్లారిటీ రావాలంటే కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీలో ఎవరో ఒకరు దీనిపై స్పందించాలి.