నాగార్జున మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మీ విడిపోడానికి కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందా?

కొన్ని నిజాలు త్వరగా వెలుగులోకి వస్తాయి. మరికొన్ని నిజాలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. మొత్తానికి నిజం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నది మాత్రం నిజం. ఎందుకంటే నిజం నిప్పులాంటిది. అలాంటి నిజం ఇప్పడు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే అక్కేనేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మీ విడాకులు తీసుకున్న ౩౩ ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే నిజం ఆ ఇద్దరికీ తెలిస్తే సరిపోదు. నేటి తరం వాళ్ళ పిల్లలకు తెలియాలి కాబట్టి.

Advertisement

స్టార్ హీరో అక్కేనేని నాగేశ్వర రావు కొడుకు నాగార్జున, స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు ముద్దుల కూతురు లక్ష్మీ. వృత్తి పరంగా రెండు కుటుంబాలు ఎంతో ప్రేమానురాగాలతో ఉండే వాళ్ళు. రాకపోకలు బాగా సాగేవి. అయితే అప్పుడే అమెరికాలో ఎంబిఏ చదువు పూర్తి చేసుకున్న నాగర్జున ఇండియాకు వచ్చాడు.

Advertisement

నాగేశ్వర రావు కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు వెంకట్, రెండో కొడుకు నాగార్జున. వెంకట్ని హిరో చేయాలనీ, నాగార్జునను నిర్మాత చేయాలనీ నాగేశ్వర రావు కోరిక. ఆ దిశగా పనులు మొదలు పెట్టాయి.

రామానాయుడుకి కూడా ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సురేష్ బాబు, రెండో కొడుకు వెంకటేష్. సురేష్ బాబును హీరో చేయాలనీ, వెంకటేష్ని నిర్మాతను చేయాలనీ ఆశ. కూతురు లక్ష్మీకి సినిమాలన్నా, సినిమా వాతావరణం అన్నా పరమ కంపర. సినిమాకు రంగానికి సంబంధంలేని వాడిని పెళ్లి చేసుకుని, ఉద్యోగం చేసుకని బతకాలని ఆమె ఆశ.

అప్పుడు లక్ష్మీ, నాగార్జున ప్రేమలో పడ్డారు. ఆమె పెట్టిన మొదటి కండిషన్ ఒక్కే. సినిమాల్లో నటించరాదు అని. దానిని అతను ఒప్పుకున్నాడు. అప్పటికి హీరో కావాలనే తలంపు అతనికి ఏ కోశానా లేదు. ఈ ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరి పెళ్లి 1984 లో జరిగింది. 1986లో నాగచైతన్య పుట్టాడు. అప్పటివరకు అందరు సంతోషంగా ఉన్నారు.

అప్పటికే నాగార్జున ఓ కొత్త పరిశ్రమ పెట్టాలని యోచించారు. ట్యూబ్ లైట్ నిర్మాణంలో వాడే వైట్ లెడ్ పౌడర్ విదేశాలనుంచి తెప్పించేవాళ్ళు. ఆ ఫాక్టరీ ఇండియాలో తొలిసారి పెట్టాలని నాగార్జున పట్టుదలతో ఉన్నాడు. కానీ విధి చాలా విచిత్రమైనది. హీరో కావాలి అనుకున్న అక్కినేని వెంకట్ హీరో కాలేకపోయాడు. అతను ఆ ఫాక్టరీ బాధ్యతలు తీసుకోగా, నాగార్జున హీరోగా మారాల్సి వచ్చింది. అది ఇష్టంలేని లక్ష్మీతో గొడవలు మొదలయ్యి.

అప్పట్లో తెలుగు పరిశ్రమ మద్రాస్ లో ఉండేది. అక్కినేని నాగేశ్వర రావు తన సినిమాలను అన్నపూర్ణ స్టుడియోలో నిర్మించే వారు. ఎవ్వరైనా సరే – హైదరాబాద్ కి రావలసిందే. హోటల్లో ఉండవలసిందే. పొతే ఆడవాళ్లకు ఇబ్బందిగా ఉండేది. వాళ్ళను చూసేందుకు జనం దండయాత్రలు చేసేవాళ్ళు. అందుకే ఆడవాళ్ళ కోసం గెస్ట్ హౌస్ లు నడిపారు. అందులో సావిత్రి, జమున, వాణిశ్రీ లాంటి వాళ్ళు గుట్టుగా ఉంది, షూటింగ్ కి వెళ్ళేవాళ్ళు. క్రమేనా ఆ గెస్ట్ హౌస్ కేవలం ఆడవాళ్లాకు మాత్రమే మారింది. అందులోను కొత్త అమ్మాయిలకు మాత్రమే కేటాయించేవారు.

అప్పటికే కత్తిలా ఉన్న నాగార్జునన్ను వల్లో వేసుకుని హీరోయిన్ వేషాలు కొట్టేయాలని కొత్త అమ్మాయిలు వెంటపడే వాళ్ళు. అవికస్త పుకార్లుగామారి లక్ష్మీ చెవిన పడ్డాయి. ఆమె ఇక సహించలేకపోయింది. తను కావాలో, సినిమా కావాలో తేల్చుకోమని ఆమె తిరగబడింది.

1990లో నాగార్జున, లక్ష్మి ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత అతను అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. తర్వాత లక్ష్మీ తాను కోరినట్లు సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుని బెంగుళూరులో స్టిరపడింది. ఆమె తన కొడుకు చేతుని సినిమాల్లోకి రాకుండా కట్టుదిట్టం చేసింది. కానీ నాగార్జున రక్తం ఎటుపోతుంది? అతను కూడా సినిమాల్లోక్కి రాగానే లక్ష్మీ మరో సారి జీవితంలో ఓడిపోయింది.

Advertisement