Barrelakka Sirisha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం బర్రెలక్క అలియాస్ శిరీష పేరు విస్తృతంగా వినిపిస్తోంది. అయితే నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం కొల్లాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బలిలోకి దిగిన బర్రెలక్క తెలంగాణ ఎలక్షన్స్ లో తీవ్ర చర్చనియాంశంగా మారింది. నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసింది. ఈ క్రమంలోనే తనదైన శైలిలో ప్రచారం చేస్తూ బర్రెలకు దూసుకెళ్తోంది. దీంతో ఆమెకు ప్రజలతోపాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో బర్రెలక్క సెన్సేషనల్ గా మారింది. అయితే తాజాగా బర్రెలక్క కన్న తండ్రి ఆమె గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో బరి లెక్క తండ్రి మాట్లాడుతూ…నా కూతురు శిరీష అలియాస్ బర్రెలక్క కు ఘనంగా పెళ్లి చేశానని కానీ ఆమె తన భర్త నుండి విడాకులు తీసుకొని తల్లితో ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్నికల ప్రచారంలో తండ్రి తాగుబోతుని మమ్మల్ని సరిగా చూసుకోలేదు అంటూ ప్రచారం చేస్తుందని బర్రెలక్క చెప్పేదేమీ నిజం కాదని వెల్లడించాడు. కూతురు జీవితం బాగుండాలనే తనని ఇంటర్మీడియట్ అగ్రికల్చర్ కోర్స్ చదివించానని కుటుంబానికి అండగా ఉండి వారిని మంచిగా చూసుకున్నాను కానీ వాళ్లు నాపై లేనిపోని నిందలు వేసి దూరం పెట్టారని తెలియజేశాడు.
అంతేకాదు వారికి ఆస్తులు కూడా పంచిపెట్టానని ,నాన్న నేను చదువుకొని నీ పేరు నిలబెడతానంటే ఐఏఎస్ అయ్యేంతవరకు చదివించానని ,దానికోసం వంట పని హోటల్ నడిపించానని బర్రెలెక్క తండ్రి చెబుతూవాపోయారు.అయితే బర్రెలక్క మాత్రం బుద్ధిగా చదువుకోలేదని ఆమె తండ్రి తెలియజేస్తున్నాడు. బర్రెలక్క పదవ తరగతి చదివే టైంలోనే అమ్మ తిట్టిందని అందరూ తిడుతున్నారని నిద్ర మాత్రలు మింగిందట. అలాగే పదేళ్ల కిందట మా నాన్న మమ్మల్ని వదిలేసాడని చెప్పుకొస్తుంది. మరి నేను అప్పుడు వాళ్ళని వదిలేసి ఉంటే వారిని ఇంత చదువు చదివించింది ఎవరు..?అంటూ ఆమె తండ్రి ప్రశ్నిస్తున్నారు.మరి తన సొంత తండ్రి వ్యాఖ్యలపై బర్రెలక్క ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.