Nayanathara: నయనతార విగ్నేష్ శివన్ చాలా ఏళ్లు ప్రేమించుకుని ఒక కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నయనతార తమిళ్ దర్శకుడు అయినటువంటి విగ్నేష్ శివన్ ని ఎంతో ప్రేమించి జూన్ 9న మహాబలిపురంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సినిమా ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పలువురు రాజకీయ ప్రముఖులే కాక బాలీవుడ్ కోలీవుడ్ చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు నయనతార విగ్నేష్ ల వివాహానికి హాజరయ్యారు. కాగా నెట్ ఫ్లిక్స్ లో వీరి పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులు ముందుకి నెట్ ఫ్లిక్స్ వారు తీసుకురాబోతున్నారు.
Nayanathara : నయనతార పెళ్లి టీజర్ ని రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్…
కాదా వీరిక పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకి రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు. పెళ్లికి వచ్చిన అతిథులను కూడా రిక్వెస్ట్ చేసి వీడియోలు బయటకు వెళ్ళనీయకుండా చూశారు. కేవలం తాళి కట్టే ఫోటో మరికొన్ని ఫోటోలు రిక్వెస్ట్ మీద సోషల్ మీడియాలో నయనతార మరియు విగ్నేష్ శివన్ లు పోస్ట్ చేయడం జరిగింది. వీరి ఇరువురికి సంబంధించిన మ్యారేజ్ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ సంస్థ 25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి మనందరికీ విధితమే. వీరు పెళ్లికి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీగా ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా ఈ పెళ్లిని నిర్వహించడం జరిగింది. ప్రముఖ దర్శకుడు అయినటువంటి గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో వరుడు విగ్నేష్ కు సంబంధించిన వీడియోని చిత్రీకరించారు. ‘నయనతార జియాండ్ ద ఫేయరీటేల్’ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ ద్వారా స్ట్రీమ్ కానుంది.

ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన నయనతార విగ్నేష్ ల వివాహ టీజర్ ను తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ లో నయనతార పెళ్లిలో పెళ్లికూతురుగా సిద్ధం కావడం మరియు విగ్నేష్ శివన్ తో తాను ఎలా ప్రేమలో పడ్డది అనే విషయాలు ఆమె చెప్పడం అలాంటి విషయాలు మాత్రమే ప్రస్తుతానికి టీజర్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని ఇంకా చెప్పలేదు. కాగా గతంలో నయనతార వీరి వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంకా తమిళ్ సూపర్ స్టార్ సూర్య దంపతులు నయనతార వివాహానికి హాజరుకాగా వారి ఫోటోలను ఇటీవలనే నయనతార షేర్ చేయడం జరిగింది. ఇలా షేర్ చేసినందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ వీరికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ వీరు పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నట్లు వార్తలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. కాగా ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.