Actress Rekha Boj : ‘ ఇండియా ఓడిపోవడానికి కారణం నువ్వే ‘ – టాలీవుడ్ నటిపై నెటిజన్లు ఫైర్ ..

Actress Rekha Boj : ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తో ఇండియా చిత్తుగా ఓడిపోయింది. అయితే దీనికి కారణం తెలుగు నటి అని ఆమెపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తెలుగు నటి అయిన రేఖా భోజ్ చాలా తక్కువ మందికి తెలుసు. టాలీవుడ్ లో ఇలాంటి నటి ఉందని ఎవరికి తెలియదు. అయితే ఈమె చేసిన కామెంట్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఈసారి ప్రపంచ వరల్డ్ కప్ లో భారత్ గెలిస్తే విశాఖపట్నంలోని బీచ్ లో తాను నగ్నంగా పరిగెత్తుతానని రేఖా బోజ్ ప్రకటించింది. ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ఈ ప్రకటన వెల్లడించారు.

Advertisement

netigens-fire-on-rekha-bhoj-post

Advertisement

తర్వాత ఈ పోస్ట్ పై విమర్శలు ట్రోలింగ్ లు వచ్చాయి. ఇండియా ఓడిపోవడంతో అవి కాస్త మరింతగా పెరిగాయి. ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో రేఖ పోస్టుపై సోషల్ మీడియాలో ట్రోల్ విపరీతంగా పెరిగింది. నిర్మానుషంగా ఉన్న విశాఖపట్నం బీచ్ ఫోటోలను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. బీచ్ లో ఎవరూ లేరు అయినా ఆమె హామీ ఫలించలేదు అని ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరైతే నీ కారణంగానే ఇండియా ఓడిపోయింది. నీలాంటి వాళ్ళు ప్రకటనలు చేయకుంటే బాగుంటుంది అని ఫైర్ అవుతున్నారు.

netigens-fire-on-rekha-bhoj-post

మీకోసం టీమిండి ఎదురుచూస్తుంది వెళ్లి సన్మానం చేయించుకో అని పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఇక రేఖ ఈ ప్రకటన పబ్లిసిటీ కోసమే చేశారని తెలుస్తుంది. ఆమె నగ్నంగా పరుగులు పెట్టాలని ఎవరు ఆశించరు. ఇలాంటి స్టేట్స్మెంట్స్ వల్ల ట్రోల్స్ వస్తాయే తప్ప మంచి ఏమాత్రం జరగదు. అయినా ఇలాంటి వాళ్లు తరచూ ఇలా చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక ఈ ప్రకటనపై రేఖ వివరణ కూడా ఇచ్చారు. భారత్ జట్టుపై తనకున్న ప్రేమను అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. తన ప్రకటనతో ఇతర జట్ల అభిమానులు కూడా భారత్ గెలవాలని ప్రార్ధించారని తెలిపారు.

Advertisement