Pooja Hegde : తెలుగు, తమిళ్, మరియు హిందీ సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజీ పెంచుకున్న హీరోయిన్ పూజా హెగ్డే ఈ అమ్మడు కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ భామ కొంచెం సమయం దొరికితే చాలు విహారయాత్రలు అంటూ వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్లడమంటే ఈ ముద్దుగుమ్మకి చాలా ఇష్టమంట. అయితే ఈ అమ్ముడు తాజాగా మూడు ఖండాలు, నాలుగు నగరాలు, వన్ మంత్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ అమ్మడు ముంబై నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఫ్లైట్ ఎక్కుతూ ఫోటోను మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈ భామ సౌత్ లో సినిమాలకు అధిక మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నట్లు ననెట్టింటా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి హీరోల సరసన బాలీవుడ్ లో నటించబోతుంది. అయితే ఈ భామ కోలివిడ్ లో సరియైన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ భామ అసలు మొదట తమిళ సినిమాలో రంగ ప్రవేశం చేసింది. పది సంవత్సరాల క్రిందట మూగముడి అనే సినిమా ద్వారా కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
Pooja Hegde : పూజా హెగ్డే, ఇలియానా భామల ఇద్దరి రూట్ ఒకటేనా…
ఈ సినిమా తను అనుకున్నంత సక్సెస్ ను అందుకోలేకపోయింది. దానివల్ల పూజాను సినీ పరిశ్రమ సరిగా పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత కూడా ఒక చిత్రం చేసింది. విజయ్ సరసన నటించిన అది కూడా పెద్దగా కలిసి రాలేదు. కానీ అల్లు అర్జున్ తో కలిసి నటించిన సినిమా అలవైకుంఠపురంలో ఈ సినిమాతో ఈ అమ్మడు ఎంతో క్రేజ్ ను పెంచుకుంది. అయితే ఒకప్పుడు ఇలియానాకి కూడా ఇదే పరిస్థితి, తను కేడి సినిమా కోలివిడ్ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా విఫలమయ్యింది దీని తర్వాత ఈ అమ్మడిని పట్టించుకోలేదు.
అయితే టాలీవుడ్ లో కొన్ని చిత్రాలును చేసి క్రేజ్ ను పెంచుకుంది. తర్వాత మళ్లీ తిరిగి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. విజయ్ తో కలిసి ననబన్ సినిమాలో అడుగు పెట్టింది. ఈ సినిమా మిశ్రమ సంపదన కారణంగా ఈ భామ ఇక్కడ కనిపించలేదు. అయితే పూజ హెగ్డే కూడా అదే సిచువేషన్ లో ఉన్నది. అయితే ప్రస్తుతం ఈ భామ సూర్యతో కలిసి నటించే మరొక అవకాశం వచ్చినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భామకు ఈ సినిమాతో తనకు ఛాన్సులు వస్తాయా.. రావా.. వేచి చూడాల్సిందే.
View this post on Instagram