Poorna : పూర్ణ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ అందుకున్న ఈ అమ్మడు. ఎన్నో సినిమాలను చేసి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కొన్ని ప్రోగ్రామ్లలో, ఒకపక్క సినిమాలలో కొంచెం బిజీగానే ఉంటుంది. ఈమె బొద్దుగా ముద్దుగా తన అందాలతో కుర్రాలని మత్తెక్కిస్తుంది. అయితే ఆమె తాజాగా ఈ సంవత్సరం జూన్ నెలలో తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఎవరో కాదు ఆసిఫ్ అలీ. ఈయనతో తను ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు సోషల్ మీడియాలో సమాచారం జరిగింది.
పూర్ణ తనతో దిగిన కొన్ని ఫోటోలను ప్రేక్షకులతో పంచుకుంది. అలాగే ఆ తదుపరి వివాహంపై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఇక దీంతో రోమర్స్ రాయుళ్లకు ప్రాణం పోసినట్లయింది. ఇక ఆమెపై ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఆ వార్తలలో తన వివాహం క్యాన్సిల్ అయినట్లు వార్తలను పోస్ట్ చేశారు. వాళ్లు ఎన్నో సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నవారు. వాళ్ళిద్దరి ఇష్ట అనుసారంతోనే ఎంగేజ్మెంట్ చేసుకొని తొందర్లో వివాహానికి రెడీ అవుతున్న నేపథ్యంలో వివాహం క్యాన్సిల్ అయింది అంటూ సమాచారాలు మొదలయ్యాయి.
Poorna : పుకార్లకు చెక్ పెట్టిన పూర్ణ…

దీని సందర్భంగా వివాహం క్యాన్సిల్ అయింది అంటూ వస్తున్న రూమర్స్ పై నటి పూర్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది. తను వివాహం చేసుకోబోయే వాడితో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆ వ్యక్తి ఎప్పటికీ వదలను అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక దీనితో రూమర్స్ రాయుళ్ల నోటికి గేటు వేసింది. ఆమె ఇప్పుడు కొన్ని సినిమాలు, కొన్ని ప్రోగ్రామ్లతో చాలా బిజీగా ఉంటుంది. ఈ అమ్మడు అఖండ సినిమాతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ తొందర్లో దసరా బ్యాక్ డోర్ మూవీలతో అభిమానుల ముందుకు రాబోతుంది.