Priyamani : ‘ పుష్ప 2 ‘ లో ప్రియమణి… ఎవరికీ జోడీగా అంటే…

Priyamani : తెలుగు సినిమాల్లో ఒకప్పుడు కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో నటించిన ప్రియమణి. హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత కొంతకాలం సినిమాలకు దూరం అయ్యారు. కొన్ని టీవీ షోల ద్వారా మళ్లీ తెరపైకి వచ్చి మంచి అవకాశాలని అందుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వెంకటేష్ తో ‘ నారప్ప ‘ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ విరాటపర్వం ‘ సినిమాలోని కీలకపాత్రను పోషించింది ప్రియమణి. అయితే రీసెంట్గా మరో బంపర్ ఆఫర్లు కొట్టేసిందంట.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ‘ పుష్ప 2 ‘సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రియమణిని పుష్ప 2 సినిమాలో తీసుకుంటున్నట్లుగా సినీ పరిశ్రమలో టాక్ వస్తుంది. ఈ సినిమాను వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు సమాచారం.

Priyamani : ‘ పుష్ప 2 ‘ లో ప్రియమణి… ఎవరికీ జోడీగా అంటే…

Priyamani acts in pushpa 2 movie
Priyamani acts in pushpa 2 movie

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో విజయ్ సేతుపతి జోడిగా ప్రియమణి నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు పాత్రలకి ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు. అందుకే ఈ పాత్రకి ప్రియమణి అయితే బాగుంటుంది అని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిటింగ్స్ మొదలు పెట్టారట. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాపై అనేక పుకార్లు వస్తున్నాయి. అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.