Puri Jagannadh : భార్య తిట్టిందని చెప్పిన పూరి… స్టేజ్ మీద ఛార్మికి లవ్ యు చెప్పేసాడుగా…

Puri Jagannadh : ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ‘ లైగర్ ‘ సినిమా చేశాడు. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో వరంగల్లో ఓ ఈవెంట్ నిర్వహించారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ వర్షం పడుతున్న తడుచుకుంటూ వచ్చి నిలబడ్డ మీ అందరికీ లవ్ యు. లైగర్ ఆగస్టు 25న రిలీజ్ కాబోతోంది. కరణ్ జోహార్ కు థ్యాంక్స్. కింగ్ ఆఫ్ బాలీవుడ్. రాజుల బతుకుతాడు. ఆయనే మాకు సపోర్ట్ చేశాడు. అపూర్వ మెహతా, ధర్మా టీం అందరికీ థాంక్స్. ఒకరోజు మా ఆవిడ నన్ను తిట్టింది. ఎందుకంటే కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. నువ్వేమో ఇలా వెనకబడ్డావు కాస్త పక్క చిత్రాలు కూడా చూడు అని అంది. ఏ సినిమా చూడాలని అడిగాను సందీప్ వంగా అనే కొత్త కుర్రాడు అర్జున్ రెడ్డి సినిమాను తీశాడు.

Advertisement

Puri Jagannadh : స్టేజ్ మీద ఛార్మికి లవ్ యు చెప్పేసాడుగా

నేను నా కూతురు ఆల్రెడీ మూడు సార్లు చూసామని అంది. వెంటనే నేను కూడా సినిమా చూసి 45 నిమిషాలు చూశాక ఆపేసా. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు డైరెక్షన్ బాగుంది, అంతా బాగుంది. కానీ నేను మాత్రం విజయ్ గురించే ఆలోచిస్తూ ఇంత జెన్యూన్ గా, నిజాయితీగా నటిస్తున్నాడు . సినిమాల్లోనే హీరో కాదు బయట కూడా హీరోనే. నిర్మాతగా కోటి రూపాయలు ఇస్తే సినిమాకు ఖర్చు పెట్టండి. తర్వాత తీసుకుంటాను అని అంటాడు. రెండు కోట్లు పంపిస్తే మీకు అప్పులు ఉన్నాయి కదా ఫస్ట్ అవి కట్టండి అని అంటాడు. అలాంటి హీరో ఎక్కడ ఉంటారయ్యా.

Advertisement
Puri Jagannadh talk about her wife lavanya and heroin charmi
Puri Jagannadh talk about her wife lavanya and heroin charmi

ఆయన ఫాదర్ నాకు ఫ్రెండ్ నీ కొడుకు అనుకుని మంచి సినిమా తీయమని అన్నాడు. కానీ విజయ్ నన్ను తండ్రిలా చూసుకొని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. విజయ్ చార్మిలు ప్లాన్ చేస్తారు. అన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు. ఇలాంటి హీరోని నేనెప్పుడూ చూడలేదు. మళ్ళీ దొరకరు. ఈ సినిమాలో అనన్య మారాణి. అందగత్తె కాదు. మంచి నటి. ఫైర్ బ్రాండ్. హీరోతో ఉండే అన్ని సీన్స్ చాలా ఇష్టం. ఆడాళ్లు మగాళ్ళ మీద అరుస్తు చేస్తే నాకు ఇష్టం. ఇది లవ్ స్టోరీ. దాన్ని మీరు చూడాలి. రమ్యకృష్ణ గారు రెబెల్ తల్లి. ఇలాంటి తల్లి ఉండాలని కోరుకుంటారు. నేను ఆవిడతో మొదటిసారి పనిచేశాను.

చార్మి అయితే సినిమా కోసం మగాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతుంటుంది. నా వరకు ఏది రానివ్వదు. అన్నీ తనే చూసుకుంటుంది. ప్రొడక్షన్ లోనే కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడవడం కూడా నాకు చెప్పదు. ప్రొడ్యూసర్లకు అన్ని కష్టాలు ఉంటాయి. ఏ ప్రొడ్యూసర్ కూడా ఏడవకుండా సినిమాలు తీయడు. చార్మి అన్ని విజయ్ కి చెబుతుంది వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సినిమాకు అన్ని తానే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. లవ్ యు చార్మి. అలాగే లైగర్ టీం కోసం పనిచేసిన అందరికీ థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు పూరి.

Advertisement