Ram pothineni : మొదటి సారిగా ఒక స్ట్రైట్ తెలుగు లో ది వారియర్ చిత్రం తెర్రకెక్కించారు తమిళ్ దర్శకుడు లింగస్వామి. ఈ చిత్రంలో నటి నటులు రామ్ పోతినేని కృతి శెట్టి ఆది పినిశెట్టి విలన్ గా చేశారు. ఈ చిత్రంలో కొన్ని పాటలు కూడా రిలీజ్ చేశారు. బుల్లెట్ అనే పాట బాగానే పాపులర్ అయింది. ఈ సినిమా 14 జులై న విడుదల కానున్నది. అయితే దీని సందర్భంగా ఆదివారం ది వారియర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ లో యాంకర్ సుమ తెగ సందడి చేసింది.
సుమ ఈ వేదికపై రామ్ ను కృతి శెట్టి నీ కొన్ని క్వెషన్స్ అడిగింది. ప్రేక్షకులు అడిగారంటూ సుమ తను అడగాలి అనుకున్న ప్రశ్నలను అడిగింది. కృతి శెట్టి ని ఇలా అడిగింది. నీకు నటించడం సులువా? డాన్స్ చేయడం సులువా? అని అడిగింది. ఆయనకు ఈ రెండు సులువే ఎందుకనగా రామ్ కో ఆర్టిస్టు అని చెప్పింది. లింగస్వామి గారు ఎక్కువ టెక్స్ట్ తీసుకుంటున్నాడా అని అడిగింది లేదు లేదని చెప్పింది కృతి శెట్టి.
Ram Pothineni : ఇరికించాలని అనుకున్న సుమ, స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చిన రామ్…
సుమ, రామ్ నీ ఇరికించాలని గట్టి ప్లాన్ వేసుకుంది. ఫస్ట్ మీకు సాంబార్ ఇడ్లీ ఇష్టమా? లేదా బిర్యానీ అంటే ఇష్టమా? అని అడిగింది సుమ, రామ్ ని అయితే మన హీరో రామ్ ఇలా సమాధానం ఇచ్చాడు. టిఫిన్ లోకి సాంబార్ ఇడ్లీ ఇష్టం.. లంచ్ లోకి బిర్యాని అంటే ఇష్టమని అన్నాడు. ఇలా రెండు కవర్ చేశాడు. మీరు ఇంటర్ ఎందుకు పూర్తి చేయలేదు? స్కూల్ కి వెళ్ళనందుకు పూర్తి చేయలేకపోయారా? వెళ్లినా కూడా పూర్తి చేయలేకపోయారా? అని సుమా అడిగింది.
నేను వెళ్ళినా కూడా కంప్లీట్ చేయలేకపోయే వాడినేమో అని రామ్ సమాధానం ఇచ్చాడు. అయితే నాకు 15 సంవత్సరాల వయసులోనే ఆర్బి చౌదరి గారు నన్ను చెన్నై నుంచి తీసుకొచ్చేశారు అని చెప్పాడు.రామ్, ఇంకా మరి మీ పెళ్లి మేటర్ లో క్లారిటీ ఇవ్వండి అని అడిగింది. సుమ, ఎప్పుడో ట్విట్ వేశారు. కానీ పెళ్లి ఇప్పుడు చేసుకుంటారా? నెక్స్ట్ ఇయర్ చేసుకుంటారా? అని అడిగింది .సుమ, అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, అని స్మార్ట్ గా సమాధానం ఇచ్చాడు రామ్.