Bigg Boss 6 : ఈ బ్యూటీకి ఆర్జీవి ఫుల్ సపోర్ట్…. ఇద్దరి రొమాంటిక్ పిక్ షేర్ చేస్తూ అలా….

Bigg Boss 6 : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కు రోజు రోజుకు చాలా పాపులర్ అయిపోతుంది. తెలుగులో పట్టాహాసంగా ప్రారంభమైన ఈ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నాగార్జున హోస్ట్ చేస్తూ తెలుగులో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో 21 మంది కన్సిస్టెన్లతో ప్రారంభమైన ఈ షో భారీ రేటింగ్స్ తో దూసుకెళ్తుంది. గడిచిన 5 సీజన్ లు బాగా విజయవంతం కావడంతో బిగ్ బాస్ సీజన్ 6 పై కూడా ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పేరిగి పోయాయి. దీంతో ఆడియన్స్ అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా నిర్వాహకులు కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ రెండు వారాలు విజయవంతంగా ప్రదర్శింపబడిన ఈ షో మూడోరోజు వారంలోకి అడుగు పెట్టింది.

Advertisement
Ramgopal Verma supported to inaya sulthana to protect from bigg Boss nomination
Ramgopal Verma supported to inaya sulthana to protect from bigg Boss nomination

ఇప్పటిదాకా నామమాత్రంగా సాగుతున్న ఈ షో ఇప్పటినుంచి అసలు ఆట మొదలు కానుంది. ఇప్పుడిప్పుడే ఎలిమినేషన్ ప్రక్రియ నడుస్తుండడంతో షో చాలా ఇంట్రెస్టింగా సాగుతోంది. మూడో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ హాట్ వాతావరణం బిగ్ బాస్ లో కనిపిస్తుంది. వాడి వేడిగా నడిచిన నామినేషన్ ప్రక్రియ లో 9 మంది ఏంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ లిస్టులో చలాకీ చంటి, వాసంతి, బాలాదిత్య, ఆరోహి రావు, ఇనయా సుల్తానా, నేహా చౌదరి, శ్రీహా,న్ రేవంత్, గీతు రాయల్ నామినేషన్ లో నిలవడం జరిగింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారడంతో ఆర్జీవి తన స్నేహితురాలు అయినయా సుల్తానా కోసం రంగంలోకి దిగడం జరిగింది.

Advertisement

ఏకంగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఇనయా కు తనకి మద్దతు తెలుపుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ అని సెర్చ్ చేసి నామినేషన్ లో ఉన్న ఇనయా సుల్తానానికి 10 ఓట్లు వేయండి అలాగే ఆ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి అంటూ స్వయంగా ఆర్జీవి ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇనయా సుల్తానాకు సపోర్ట్ చేయాలని ఆయన ఆమెతో దిగిన గవర్నమెంట్ పిక్ ని షేర్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆర్జీవి తనకు కావాల్సిన వాళ్ళ కోసం వాళ్ల కెరియర్ కోసం వీలైనంత సహాయం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వినయ సుల్తానా కోసం ఇప్పుడు తాను చేసిన ఈ సహాయం ఆమెకి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు ప్రేక్షకులు

 

Advertisement