నవ్యస్వామితో డేటింగ్ పై స్పందించిన రవికృష్ణ – ఆమె ప్రపోజ్ చేస్తే అంటూ..!!

బుల్లితెరపై క్యూట్ పెయిర్ గా రవికృష్ణ, నవ్యస్వామిల పేర్లు తరుచుగా వినబడుతుంటాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన సీరియల్ మంచి సక్సెస్ అందుకుంది. వీరి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీరియల్స్, సినిమాల సంగతి పక్కనపెడితే వీరిద్దరూ ప్రేమాయణంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Advertisement

నవ్యస్వామితో రవికృష్ణ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ సీరియల్ లో జంటగా నటించిన రవి- నవ్యలు అప్పటినుంచి ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు. పలు టీవీ షోలో జోడిగానే కనిపిస్తూ చర్చల్లో నానుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నవ్యస్వామితో తన రిలేషన్ పై రవికృష్ణ స్పందించారు. పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. నవ్య నా బెస్ట్ ఫ్రెండ్. ఏదైనా షో కి జంట కావాలనుకున్నప్పుడు.. మాది హిట్ పెయిర్ కావడంతో పిలిచేవాళ్ళు. జంటగా వెళ్లేందుకు తనకు, నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించకపోవడంతో వెళ్ళేవాళ్ళం.

ఇప్పటికీ మేము ప్రతిరోజు టచ్ లోనే ఉంటాం. మేము బెస్ట్ ఫ్రెండ్స్. కాని చూసేవాళ్ళు మాత్రమే లవర్స్ అనుకుంటారని వ్యాఖ్యానించిన రవికృష్ణ..ఆమె ప్రపోజ్ చేస్తే చూద్దామని తన మనస్సులోని మాటను పరోక్షంగా ప్రకటించారు. అంటే నవ్యస్వామి ఇష్టమని చెప్పకనే చెప్పేశాడు అన్నమాట.

Advertisement