Sai Pallavi : ఫ్యాన్ ను ఆశ్చర్యపరిచిన సాయి పల్లవి. వారి సంతోషం అంతా ఇంతా కాదు…

Sai pallavi : అప్పట్లో సినీ నటులు ఒక సినిమాకు మాత్రమే పరిమితం అయిపోయేవారు. కానీ ఇప్పుడు సినీ నటుల అభిమానుల జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. సోషల్ మీడియా కారణంగా నటులు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వారికి దగ్గరవుతున్నారు. ఇలా దగ్గరవ్వడం సినిమా ప్రమోషన్ లొ ఒక భాగం అనుకోవచ్చు. ఇది ఇలా ఉండగా,సాయి పల్లవి “గార్గి” అనే సినిమా తీసిన విషయం మనందరికీ తెలిసిందే.

జులై 15న ఆ సినిమాను థియేటర్లో విడుదల చేశారు. ఈ సినిమా లో అమ్మాయిలు మరియు వారిపై జరిగే అత్యాచారాలను ఉద్దేశించి సినిమా తీశారు. మరియు విడుదల చేయడం జరిగింది. సినిమా చూసినవారు సాయి పల్లవి నటన సినిమాకు వెలుగు తెచ్చి పెట్టింది అని అంటున్నారు. సినిమాకు వ‌చ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌ను మ‌రింత పెంచే బాధ్య‌త‌ను సాయి ప‌ల్ల‌వి భుజాన వేసుకున్నారు.

Sai Pallavi : ఫ్యాన్ ను ఆశ్చర్యపరిచిన సాయి పల్లవి. వారి సంతోషం అంతా ఇంతా కాదు…

sai pallavi surprised  her fans visited to theaters Chennai, Hyderabad
sai pallavi surprised  her fans visited to theaters Chennai, Hyderabad

అందులో భాగంగా సాయి పల్లవి తానే నేరుగా చెన్నై మరియు హైదరాబాద్ థియేటర్లోకి వెళ్లి సినిమా గురించి వారిని నేరుగా అడిగి తెలుసుకున్నారు. మరియు వారితో సెల్ఫీలు దిగారు. సినిమా హీరోయిన్లలో సాయి పల్లవి కంటూ ఒక స్పెషాలిటీ ఉంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. తాను మంచి నటియే కాకుండా ఒక మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. తాను డాన్సర్ గానే సినీ ఇండస్ట్రీకి వచ్చింది, వచ్చి రాగానే “లేడీ ప‌వ‌ర్ స్టార్‌ “అంటూ పేరు తెచ్చుకుంది.