Samantha-Yashoda : సమంత తెలుగులో ‘ ఏం మాయ చేసావే ‘ సినిమాతో పరిచయమై కుర్ర కారును తనదైన మాయలో పడేసింది. ఈ సినిమా ద్వారానే నాగచైతన్యతో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత నాలుగేళ్లు కలిసి ఉన్న తర్వాత నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సినిమాలో బాగా దూసుకెళుతు బిజీబిజీగా గడుపుతుంది. ఒకదాని తర్వాత మరొకటి పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో సామ్ స్పీడ్ పెంచింది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో సత్తా చాటుతున్నారు. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్, కాదు వాక్కుల రెండు కాదల్ తర్వాత తమిళ ప్రేక్షకులకు ముందుకు వస్తున్న చిత్రం యశోద.
ఇందులో నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యదార్ధ సంఘటన ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇంతకుముందు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఆగస్టు 12న పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఏకకాలంలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా వాయిదా వేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడమే ఈ సినిమా విడుదలకు కారణమని సమాధానం.
Samantha-Yashoda : మళ్లీ వాయిదా పడిన సమంత సినిమా…
సెప్టెంబర్ రెండవ వారంలోకి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలున్నాయి. సామ్ ఇప్పటికే దక్షిణాదిలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో సామ్ నేషనల్ వైడ్ గా పాపులారిటీ అందుకుంది. అందుకే ఇప్పుడు ఈమె నటించే సినిమాలు అన్నింటిని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. సమంత ఈ సినిమా కోసం కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారట.