నటీనటులు: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు తదితరులు
సంగీత దర్శకులు: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
దర్శకులు : గుణశేఖర్
నిర్మాతలు: నీలిమ గుణ, దిల్ రాజు
మనకున్న గొప్ప దర్శకులల్లో గుణశేఖర్ Gunashekar ఒకరు. ‘సినిమా అన్నది ఒక విజువల్ మీడియా’ అని చాటి చెప్పిన తోలి మేధావి. అందుకే అతని సినిమాలో భారీ సెట్టింగ్లు ఉంటాయి. ప్రతి షాట్ కన్నుల పండుగగా ఉంటుంది. మాటలు చాలా తక్కువగా ఉంటాయి. చెవులకు పని తక్కువా – కళ్ళకు పని ఎక్కువగా కల్పించి ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళతారు. అందుకే ‘ఒక్కడు’ Okkadu Movie లాంటి సినిమాలు చరిత్రను తిరగరాసాయి.
గుణశేఖర్ సినిమాలు చూసిన సుప్రసిద్ద దర్శకుడు Director Bapu బాపు ”వెండి తెరను ఎలా వాడుకోవాలో గుణశేఖర్ కి బాగా తెలుసు. నాకు అస్సలు తెలియదు అని అతని సినిమాలు చూసాకే నాకు తెలిసింది. నేను కూడా దర్శకుడిని అని చెప్పు కోడానికి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది” అన్నారు. Ram gopal Varma రామ్ గోపాల్ వర్మ, Manirathnam మణి రత్నం లాంటి దర్శక దిగ్గజాలు ఆయనకు అభిమానులు. సినిమా ఎలా తీయాలో Rajamouli రాజమౌళి లాంటివాళ్ళు అయన సినిమాలు చూసి నేర్చుకున్నారు అని బహిరంగగానే చెప్పుకుంటారు.
మరి అలాంటి గుణశేఖర్ సినిమా అనగానే అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేదు. పొతే గుణశేఖర్ మార్క్ ‘షాట్ బ్యుటి’ మాత్రం ఇందులో ఉన్నది. ఎవ్వరికి తెలియని కథను మాములుగా చెప్పినా సినిమా హిట్ అవుతుంది. కానీ అందరికీ తెలిసిన కథను ఎంతో గొప్పగా చెపితే తప్పా అది హిట్ కాదు. ఈమధ్య మణిరత్నం కూడా ‘పోన్నియిన్ సెల్వన్’ సినిమా తీసి రెండులోంచి ఓ చేయి కాల్చుకున్నాడు. ఇక్కడా అదే జరిగింది.
కథ ఏమిటి?
అందరికి తెలిసిన కథే. విశ్వామిత్రుడు, Item Song ఐటం సాంగ్ గర్ల్ మేకనకలకు ఇల్లీగల్ గా ఓ పాపా పుడుతుంది. ఆమె ఆ పాపను స్వర్గానికి తిసుకువేల్లితే తన గ్లామర్ కు దెబ్బ అని భావించిన ఆమె అడవిలో వదిలి వెళ్ళుతుంది. ఆ రోజుల్లో చెత్త బుట్టలు లేవు. ఆ పాపకు పక్షులు డైపర్ తొడిగి కణ్వ మహర్షి (సచిన్ ఖేడేకర్) ఆశ్రమానికి చేరుస్తాయి.
పాపకు శకుంతల అనే పేరు పెడతాడు ఆయన. పెరిగిన శకుంతల కూడా దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) తల్లి లాగే ప్రేమలో పడిపోతుంది. తల్లిలాగే తొందర పడుతుంది. ఆ ప్రేమికులు డేటింగ్ (గాంధర్వ వివాహం) తో ఒక్కటవుతారు. అతను తన రాజ్యానికి వెళుతూ తన గుర్తుగా 24 క్యారెట్ల ఉంగరం ఇస్తాడు. అవసరం వస్తే మార్వాడి కొట్టులో కుదవబెట్టుకుని అబార్షన్ చేయించుకో అన్నట్లు. అప్పటికే ఆమె గర్భవతి. అబార్షన్ చేసుకోవడం ఆ రోజుల్లో మహా పాపం.
కణ్వ మహర్షి ఆశ్రమానికి దుర్వాస మహా ముని (మోహన్‌బాబు) mohan babu వస్తాడు. దుర్వాస మహా ముని రాకను గుర్తించదు.Governor Tamilasai గవర్నర్ తమిలిసై లాగా ప్రవర్తిస్తుంది. దాంతో ఆయనకు కోపం వచ్చి కేసిఆర్ లాగా దుష్యంతుడు నిన్ను మరచిపోతాడని శాపం ఇచ్చేసి వెళ్లిపోతాడు.
దుష్యంతుడు రాకపోయేసరికి కణ్వ మహర్షి ముందు తన పరువు పోతుంది అని హడలి చచ్చి ఆమెను రాజ్యానికి పంపిస్తాడు. ‘గజని’ లాగా శాపం కారణంగా శకుంతలను దుష్యంతడు గుర్తించడు. అక్కడినుంచి ఆమె సీత కష్టాలు మొదలవుతాయి. అప్పుడు శకుంతలం ఏం చేస్తుంది? దుష్యంతుడు, శకుంతల ఎలా కలుస్తారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇది మనకు తెలిసిన కథ. వీలయినంతవరకు కొత్తగా చెప్పాలని ప్రయత్నించాము. సారి. ఈ పాత కథను వినడం కంటే తెరమీద ఓపికగా చూడడం మంచిది.
ప్లస్ పాయింట్లు ఏమిటంటే?
‘అవతార్’ Avathar సినిమా లాగా ఈ సినిమా కన్నుల పండుగగా ఉంటుంది. ప్రతి షాట్ ను దర్శకుడు చాలా అందంగా, అద్భుతంగా మలిచారు. ఏ ఒక్క షాట్ ని కూడా చుట్టేయలేదు. ఒక్క మాటలో ఇది గొప్ప దృశ్య కావ్యం. కళకాండం. ఓ కవితలాగా అందంగా, హాయిగా ఉంది.
ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతలు నీలిమ గుణ, Dilraju దిల్ రాజు ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు. కోట్లు గుమ్మరించారు. సెట్టింగ్ లు అద్బుతం. కళా దర్శకుడి పనితీరు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ చేసిన శేఖర్ వి జోసెఫ్ పనితీరుకు వెండి తెర పులకించింది. లైటింగ్ సూపర్. దర్శకుడి కలలను తన కెమరాలో బంధించాడు.
పొతే Manisharma మణి శర్మ సంగీతం గొప్పగా లేదు. పాలనా పాట బాగుంది అనేలా లేదు. పాత కథను తీసుకుంటే మాత్రం సంగీతం కూడా పాతగా ఉండాలా? పౌరాణిక సినిమాలలోని పాత సంగీతంలా అన్ని పాటలు ఒకేలా వినిపించాయి. నాటి పౌరాణిక సినిమాల్లో కూడా ”చ్చాన్గురే బంగారు రాజా – చ్చాన్గురే చ్చాన్గురే బంగారు రాజా” లాంటి ఉపున్న పాటలు లేవా? ఆర్ఆర్ కూడా పాత సినిమాలా ఫక్కీలో ఉన్నది. కొత్తదనం లేదు.
మైనస్ పాయింట్లు ఏమిటంటే?
ఈ సినిమాకు పెద్ద మైనస పాయింట్ Samantha సమంత. ఆమె ఈమధ్య అనారోగ్యంతో ఉన్నదనే సైకాలజికల్ ఫీలింగ్ కావచ్చు, లేదా ఆమె అందం తగ్గింది అనే అపవాదు కావచ్చు. మొత్తానికి ఆమె కళ్ళలో మునపటి అందం లేదు. చాలా డల్ గా ఉన్నాయి. మందు కొట్టిన తాగుబోతు కల్లలాగా జారిపోయి ఉన్నాయి. నిదుర లేమితో అలసిన కాళ్ళలాగా, గాజు కళ్ళు దీనంగా ఉన్నాయి. జీవంలేని గాజు కళ్ళతో చూస్తుంటే ఆమె మీద జాలేస్తుంది. అందుకే రొమాన్స్ సీన్లు అస్సలు పండలేదు. ఆమె ఏడుపు సీన్లు మాత్రం కొంతవరు పండాయి. ఆమెను రెండు గంటలు చూడడం కష్టమే.
ఇక స్క్రీన్ ప్లే డల్ గా ఉంది. ఇది తెలిసిన కథ కాబట్టి గొప్ప ట్విస్ట్ లు ఉహించలేదు. కథను మార్చితే జనం ఒప్పుకోరు. పాత్రల మధ్య సంఘర్షణ అస్సలు లేదు. చాలా సీన్ లు బోర్ గా ఉన్నాయి. ఏం జరుగుతుందో ముందే తెలుసు కాబట్టి ఉత్కంట కలిగించే సంఘటనలు లేవు. ఏ సీన్ కి ఆ సీన్ వెళ్ళిపోతుంది. ఎక్కడా ఉపిరి బిగపట్టే సన్నివేశాలు లేవు. మాటలు మరీ 1975 నాటి సినిమాలను గుర్తు చేస్తాయి. కానీ నేటి తరానికి ఏంకావాలో దర్శకుడు అస్సలు అలోచినలేదు. ఇదే సినిమా 1975 వచ్చి ఉంటే బ్లాక్ బ్లాస్టర్ సినిమాగా నిలిచేది.
అందుకే ఇలాంటి కథల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఆయింట్మెంట్ ఉన్నదని చేతులు కాల్చుంటే ఎట్లా? లేదా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తీసినట్లు, వాస్తవ పాత్రలతో కల్పిత కథను కొత్తగా రాసుకుని ఉంటే బాగుండేది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిసి స్టెప్పులు వేశారు అని RRR RAJAMOULIరాజమౌళి ఆర్ఆర్ఆర్ తీస్తే జనం చచ్చినట్లు చూడలేదా? శాకుంతలం పాత్రను తీసుకుని కొత్త కథ రాసుకుని తీస్తే ఎవరు అడ్డు చెప్పేవారు?
మేము ఇచ్చే రేటింగ్ ; 5 పాయింట్లకు 2.75 మాత్రమే.