Shradha Kapoor : RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పర్ఫామెన్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. కాగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో చాలా నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కించడం రోజ రోజుకు లేట్ అవుతూ వస్తుంది. దీనికి కారణం కొరటాల శివ సినిమాకి సంబంధించిన పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ ని రెడీ చేయకపోవడం. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే రాజమౌళి సినిమా తర్వాత పక్కా ప్లాఫ్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. కానీ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ తన ప్రాజెక్టులో ప్రతి విషయాన్ని ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొరటాల శివ ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని పూర్తిగా సిద్ధమైన తర్వాతనే షూటింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారట.
అంతేకాకుండా ప్రస్తుతం అనుకున్న స్క్రిప్ట్ ని పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ మరో కథను రెడీ చేయమని కొరటాల శివతో అన్నట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. పోయిన వారం కొరటాల శివ ఒక కథను ఎన్టీఆర్ కి వినిపించినప్పటికీ ఆ కథ తో ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదని సమాచారం. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో చాలామంది అగ్ర కథానాయకులు నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్ అందరూ కొరటాల శివ ను అలాగే ఎన్టీఆర్ ను సంప్రదిస్తున్నట్లుగా సమాచారం.
Shradha Kapoor : ఎన్టీఆర్ పై కన్నేసిన సాహో బ్యూటీ…
అందులో భాగంగానే సాహో బ్యూటీ అయినటువంటి శ్రద్ధా కపూర్ కూడా ఎన్టీఆర్ తో నటించటానికి అవకాశం కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్ కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు తన కన్ను టాలీవుడ్ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఖాతాలో ఒకే ఒక్క సినిమా ఉన్నట్లుగా తెలుస్తుంది అందుకే ఎన్టీఆర్ తో అవకాశం కోసం సంప్రదిస్తున్నట్లుగా సమాచారం. కానీ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ఈ అమ్మడి కు ఈ ప్రాజెక్టులో అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి మరి.