Hardik Pandya : హార్దిక్ పాండ్యా అక్టోబర్ 11, 1993 న గుజరాత్ లోని సూరత్ లో జన్మించాడు, నాన్నపేరు హిమాన్షు పాండ్యా ఇతడు చిన్న ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు హార్దిక్ కి అయిదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ల నాన్నగారు ఆ బిజినెస్ ఆపేశారు. హిమాన్షు పాండ్యా తన పిల్లలకు క్రికెట్ నేర్పించాలని చాలా కష్టపడ్డాడు, హార్దిక్ మరియు తన అన్నయ్య కృనాల్ పాండ్యా ఇద్దరినీ కిరణ్ మోర్ క్రికెట్ అకాడెమీలో హిమాన్షు పాండ్యా చేర్పించారు. ఆర్దిక ఇబ్బందులు ఉండటం వలన వీళ్ళ కుటుంబం అందరూ ఒక అద్దె అపార్ట్మెంట్లో ఉండేవాళ్లు. క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళడానికి వీళ్లు ఒక సెకండ్ హ్యాండ్ కారుని వాడేవారు.హార్దిక్ తన ధ్యాసని మొత్తం క్రికెట్ పైనే పెట్టేవాడు.
హార్దిక్ పాండ్యా జూనియర్ స్థాయికి వచ్చేట్టుగా క్రికెట్ ని స్థిరంగా నేర్చుకున్నాడు.హార్దిక్ పాండ్యా వాళ్ళ నాన్న ప్రకారం తనకు పద్దేనిమిది ఏళ్లు వయసు వచ్చే వరకు లెగ్ స్పిన్నర్ అని అనుకునేవారు, బరోడా కోచ్ శరత్ కుమార్ గారి ఒత్తిడితో ఫాస్ట్ బౌలింగ్ నేర్చుకోవడానికి వెళ్లాడు 2013 నుంచి హార్దిక్ బరోడా క్రికెట్ టీమ్ తరుపున ఆడడం మొదలుపెట్టాడు. బరోడా లో 2013 నుంచి 2014 సీజన్స్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడానికి చాలా బాగా ఆడి ఆట గెలిచారు. 2015 లో ఐపిఎల్ మ్యాచ్ ముంబయి ఇండియన్స్ ని గెలిపించడానికి 8 బాల్స్ కి 21 రన్స్ మరియు 3 క్యాచ్‌లు పట్టి 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించారు, దానితో ఈయన కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు ఇచ్చారు.
Hardik Pandya : క్రికెటర్ హార్దిక్ పాండ్యా జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం

ఈ ఆట తర్వాత సచిన్ టెండూల్కర్ హార్దిక్ ని పిలిచి ఇండియా కోసం నెక్స్ట్ 18 నెలల్లో ఆడదువు అని చెప్పారు, సంవత్సరం లోపే హార్దిక్ 2016 ఐసీసీ వరల్డ్ ట్వంటీ లో ఆడే అవకాశం వచ్చింది .తరువాత కొలకత్తా నైట్ రైడర్స్ పైన ముంబై ఇండియన్స్ గెలిచి టాప్ ఫోర్టీన్సులో ఉండాలి అనే పట్టుదలతో 36 బాల్స్ కే 61రన్స్ చేసి ముంబయి ఇండియన్స్ నీ గెలిపించారు.ఆ సీజన్ కి సెకండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు, 27 జనవరిలో 2016 న ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో అడుగుపెట్టాడు, 2016 వరల్డ్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన ఒక రన్తో చివరి మూడు బాల్స్ తో రెండు కీలకమైన వికెట్లను ఓడించి ఇండియాను గెలిపించారు.
16 అక్టోబర్ 2016 న ధర్మశాల లో వన్డే ఇంటర్నేషనల్లో ఇండియా తరుపున ఆడాడు, సందీప్ పటేల్, మోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఓడీఐ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నాలుగవ భారతీయుడిగా పిలవబడ్డాడు. మొదటి ఓడీఐ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో 36 బాల్స్ కి 36 రన్స్ చేసాడు, 2016 లో ఇండియా టెస్టు స్క్వాడ్ లో బ్యాట్స్మెన్ గా తీసుకున్నారు. 2019 ఐపిఎల్ లో బాటింగ్ మరియు బౌలింగ్ సమానంగా చేసారు. 2019 క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా స్క్వాడ్గా పాండ్యా ని పిలిచారు. జనవరి 1, 2020 న హార్దిక్ పాండ్య కి నటాశతో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈమధ్య జరిగిన ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ ట్వంటీ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.