కృతిశెట్టిని టార్చర్ చేస్తోన్న ఆ స్టార్ హీరో కుమారుడు..!?

కృతిశెట్టి…ఉప్పెన సినిమాతో కుర్రకారు హృదయాన్ని దోచిన భామ. కృతిని చూస్తే ఎవరైనా మైమరించిపోవాల్సిందే. అలాంటి అందం కృతి సొంతం. తన అందం, అభినయంతో ఉప్పెన సినిమా అనంతరం ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అభిమానులు కూడా ఎక్కువయ్యారు.

Advertisement

శ్యాం సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో కృతి శెట్టి నటించింది. అయితే, గ్లామర్ ఫీల్డ్ ఉండగా అప్పుడప్పుడు డైరక్టర్, హీరోల నుంచి వేధింపులు ఎదురు అవుతూనే ఉంటాయనేది ఓపెన్ సీక్రెట్. హీరోయిన్ గా నిలబడాలంటే వాటన్నింటిని తట్టుకొని నిలబడాల్సిందే. ఇటీవలే ఆర్ఎక్స్ 100హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతమంది డైరక్టర్స్ అవకాశాలు ఇస్తామని తనను వాడుకొని వదిలేశారని చెప్పింది.

Advertisement

తాజాగా కృతిశెట్టి కూడా తనకు వేధింపులు ఎదురైనట్లు చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ స్టార్ హీరో కుమారుడు వేధింపులకు గురి చేస్తున్నాడట. తనతో ఫ్రెండ్ షిప్ చేయాలనీ టార్చర్ చేస్తున్నాడట. ఇటీవల తన పుట్టిన రోజు వేడుకకు రావాలని.. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా భరించేందుకు రెడీ అని ఆఫర్ ఇచ్చారట.

దీంతో కృతిని ఇంతలా టార్చర్ చేస్తూ ఆఫర్ ఇస్తోన్న ఆ హీరో కుమారుడు ఎవరని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Advertisement