Krithi Shetty : బేబమ్మ తెలుసు కదా. ఉప్పెన సినిమాతో బేబమ్మలా అందరికీ పరిచయం అయింది కృతి శెట్టి. తన చిరునవ్వుతో అందరినీ పడేసింది ఈ కన్నడ భామ. కేవలం ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో తన రేంజ్ ఏంటో నిరూపించుకుంది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు తను తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ రావడం చాలా కష్టం. కానీ.. ఉప్పెన సినిమాతో కుర్రకారు మొత్తాన్ని తనవైపునకు లాక్కుంది బేబమ్మ. ఆ తర్వాత తనకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. చాలా సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో తన రేంజ్, క్రేజ్ మామూలుగా లేదు. ఈ క్యూటీని తమ సినిమాల్లో పెట్టుకోవాలని చాలా మంది దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అందుకే తనకు తమిళం, తెలుగు భాషల్లో వద్దన్నా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
Krithi Shetty : పొరుగు భాషల్లోనూ దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ
కృతి శెట్టి కేవలం తమిళంలోనే కాదు.. మలయాళంలోనూ దూసుకుపోతోంది. తెలుగులో నాగచైతన్య సరసన ఓ సినిమాలో నటిస్తున్న కృతి, ఆ తర్వాత మలయాళం సినిమా అజయంటే రెండాం మోషనం అనే సినిమాల్లో నటిస్తోంది. ఇందులో థామస్ హీరో. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా. ఆ తర్వాత బాల దర్శకత్వంలో తమిళం మూవీ వనంగాన్ లోనూ నటిస్తోంది. ఇందులో సూర్య హీరో. ఓవైపు తెలుగులో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయిన కృతి.. ఇప్పుడు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే.. సెట్స్ లో కూడా దర్శకనిర్మాతలు చెప్పినట్టుగా చేస్తూ గుడ్ గర్ల్ అనిపించుకుంటోంది. అసలు.. అంత స్టార్ హోదా ఉన్నా ఇలాంటి నార్మల్ ఆటిట్యూడ్ ఉన్న హీరోయిన్ ను ఎవ్వరినీ చూడలేదని ఫిలిం ఇండస్ట్రీలో అంటున్నారు. మొత్తానికి కృతి శెట్టిపై ఇండస్ట్రీలో ఇలాంటి ఇంప్రెషన్ పడిందంటే ఇక తన కెరీర్ కు డోకా లేదనుకోవాలి. ఇంకా కొన్నేళ్లు తనదే రాజ్యం ఇక.