Vyooham : రాంగోపాల్ వర్మ ” వ్యూహం ” సినిమా ట్రైలర్… ఆంధ్ర రాజకీయాలకు అద్దంపట్టే పాత్రలు..

Vyooham : రాజకీయపరంగా ఎన్నో కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొనేే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్ జగన్ తన రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను చూపిస్తూ వ్యూహం సినిమాను రూపొందించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తుండగా..జగన్ పాత్రలో అజ్మల్ , వై.యస్ భారతి పాత్రలో మానస కనిపించనున్నారు. ఇక ఈ వ్యూహం సినిమాను నవంబర్ 10న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Advertisement

trailer-of-ramgopal-varmas-vyooham-characters-mirroring-andhra-politics

Advertisement

 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టేలా చాలా పాత్రలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా జగన్ , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్రలు కూడా రాంగోపాల్ వర్మ తీసుకొచ్చాడు. అంతేకాక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ప్రస్తావన ఈ ట్రైలర్ లో రావడం గమనార్హం. అయితే తాజాగా ఈ సినిమాపై వర్మ స్పందిస్తూ ప్రజలకు తెలిసిన విషయాలు కాకుండా తెర వెనుక జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీసినట్లుగా చెప్పుకొచ్చాడు.

నేను తీసే ప్రతి సినిమా 90% ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారానే రూపొందిస్తా. ఇక ఈ కథలో వైఎస్ మృతి నుంచి నేటి వరకు జరిగిన సంఘటనలు ఉంటాయని..ఇక ఈ సంఘటనలు ప్రజలకు నిజంగా తెలియని వర్మ పేర్కొన్నారు. అవన్నీ చూపించే విధంగా ఈ మొత్తం ఇన్సిడెంట్ కు సంబంధించిన ఆధారాలను సేకరించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తుంది .ఇది ఇలా ఉండగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాతో పాటు శపథం అనే సినిమాని కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది. ఇక ఈ శపథం సినిమాను జనవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

Advertisement