Viral Video: తల్లి ప్రేమ మించినది ఈ ప్రపంచం లో ఎది లేదు. ఇంకా తల్లి ప్రేమ నిస్వార్థమైనది, తన బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు ఎంత దూరం అయిన వెళ్ళగలదు. మనుషుల్లోనైనా, జంతువులలో నైనా సరే, తల్లీబిడ్డల ప్రేమ అందరిలో సర్వసాధారణం. మనం చాలా వీడియో లలో తల్లి పిల్లల ప్రేమకు సంబధించిన వీడియోలు చాలా చసి ఉంటాం. తల్లులు తమ పిల్లల కోసం చాలా త్యాగం చేసే వీడియోలను మీరు ఖచ్చితంగా చూసి ఉండవచ్చు. ఆన్లైన్లో కనిపించిన తల్లి ఏనుగు వీడియో, తన పిల్ల ఏనుగును రక్షించడానికి మనుషులను సహాయం కోరడం కోసం ఎలా రోడ్డుపైకి వచ్చిందో ఈ వీడియో లో చూడొచ్చు.
నేచర్ అండ్ హెరిటేజ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఒక తల్లి ఏనుగు రోడ్డున పోయే వారిని చాలా సమయం వరకు ఏదో అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అడవి ప్రజలను చూసి మొదట భయపడ్డా, ఆ ఏనుగు ఎవరికీ హాని తలపెట్టలేదని స్పష్టంగా అర్థమైంది. ఆ తరువాత a enufmgunu dhram తరిమి కొట్టడానికి వారు క్రాకర్లు కూడా పేల్చారు, కానీ తల్లి చలించలేదు. తనకు సహాయం అవసరమని ప్రజలు అర్థం చేసుకునే వరకు అంతే నిలబడి ఉంది.
Viral Video : తన బిడ్డను కాపాడమని మనుషులని అడిగిన తల్లి ఏనుగు

ఈ వీడియో లో, ఏనుగు తన పిల్ల ఎనిగు పడిపోయిన బావి వ్వధకు జనాన్ని తీసుకెళ్లడం మనం చూడొచ్చు. కొద్దిసేపటికే, అక్కడ గుమిగూడిన ప్రజలు పిల్ల ఏనుగు ఎక్కడానికి మెట్ల వంటి నిర్మాణం కోసం బావి దగ్గర మట్టిని తవ్వడం ప్రారంభించారు.గున్న ఏనుగు ఆ తొవ్విన దారి గుండా సురక్షితం గా బయటకు వచ్చి తన తల్లి వద్దకు చేరి అడివిలో కి వెళ్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ ఆశ్చర్య పోయారు. వారు తల్లి బాధను అర్థం చేసుకుని ఏనుగుకు సహాయం చేసిన వ్యక్తులను ప్రశంసలతో కామెంట్స్ చేశారు. తల్లి ప్రేమ ఎంత నిస్వార్థంగా ఉంటుందో నెటిజన్లు ఎన్నో రకాలు గా కామెంట్స్ చేశారు