Health tips : మన ఆరోగ్యానికి కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలలో ఉన్న పోషకాలు మరి ఎటువంటి ఆహారాలలో ఉండవు. అయితే కొన్ని కూరగాయలు వండిన తర్వాత మరింత పోషకాలుగా మారుతాయి అని వైద్యులు చెబుతున్నారు. కూరగాయలను ఇలా వండితే పుష్టికారంగా మారుతాయి. సాధారణంగా పోషక విలువలు ఉన్న కూరగాయలను కొన్నింటిని పచ్చిగానే వండుతాం. కొన్నేళ్లుగా కూరగాయలు వండినప్పుడు డిహైడ్రేట్ అవుతుందని వాటిని పచ్చిగా తింటే ఆరోగ్యానికి మంచిదని నమ్మకం ఉండేది. కానీ అసలు విషయం ఏంటంటే కూరగాయలు వండిన తర్వాత పోషక విలువలు ఎక్కువ ఉంటాయని సమాచారం. ఇలా వండుకుంటే ఎలాంటి కూరగాయలు అయినా పోషక విలువలు మారుతాయి.
పాలకూరలో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ పాలకూరని బాగా వండితే తప్ప దానిలో ఉండే పోషకాలు అందవని అంటున్నారు. వంట సమయంలో పాలకూర నుండి క్యాల్షియం విడుదల అవుతుంది. ఈ కూర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తోటకూర మన కణాలకు కావలసిన అన్ని పోషకాలను అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పోషక విలువలు ఉన్న మొక్కలలో ఒకటి తోటకూర. ఇందులో విటమిన్ ఏ బి9, ఇ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉడికించినప్పుడు దీనిలో ఉండే పోషకాలు నీటిలో దొరుకుతుంది.
బ్రజికా క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రోకలీతో సహా అన్ని కూరగాయలు ఉడికించినప్పుడే అందులో ఉండే పోషకాలు బయటికి వస్తాయి. అందుకనే వీటిని పచ్చిగా తినడం కంటే ఉడికించిన తర్వాత తినడం మేలు. సూప్ చేయడానికి, క్యాలీఫ్లవర్ 65, మంచూరియా వంటి అనేక రకాలుగా వీటిని తీసుకోవచ్చు. అయితే ఆవిరి మీద ఉడికించి తింటే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే బీన్స్ అందరూ ఇష్టపడే కూరగాయలు. మనం రోజు తినే సాంబార్, కర్రీ మొదలుకొని ఫ్రైడ్ రైస్ వరకు అనేక వంటకాలు ఉడికించినప్పుడు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బీన్స్ ను ఆయిల్ లో వేయించుకొని తింటే దాంట్లో ఉండే పోషకాలు లభిస్తాయి. కూరగాయలను ఇలా వండుకొని తింటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.