Almond Side Effects : బాదం పప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. బాదం పప్పులు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కానీ బాదములని ఓ మోతాదుకు మించి తింటే అనారోగ్య సమస్యలు తప్పవు. బాదం పప్పులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. నాలుగైదు బాదంపప్పులో నానబెట్టి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడంతో చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.
డెత్ స్కిన్సు తొలగింపబడి, న్యూ స్కిల్స్ ఏర్పడతాయి. డ్రై ఫ్రూట్స్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అయితే వీటి రోజు నానబెట్టుకుని తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదంపప్పులో మంచి కొవ్వు లు, ఓ మెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, ఫైబర్ ,విటమిన్స్ వంటివి అధికంగా లభిస్తాయి. వీటిని తరచుగా తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఎన్నో రకాల రోగాలు నయమవుతాయి. బాదం పప్పులు అధిక బరువును తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తాయి. డయాబెటిస్ ని తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి, మన శరీరానికి కావాల్సిన శక్తిని అందజేస్తాయి.
Almond Side Effects : బాదంపప్పులతో దుష్ప్రభావాలు కూడా అన్నే ఉన్నాయి తెలుసా…?

వీటిని పచ్చిగానే తినకుండా నీటిలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి చాలా మంచిదని వీటిని మోతాదుకు మించి తింటే శరీరానికి మంచి జరగవలసినది పోయి చెడు జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు బాదం పప్పులను ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 20 గ్రాముల బాదం పలుకుల్లో 164 క్యాలరీలు ఉంటాయి. ఇతర పోషకాహారాలతో పాటు వీటిని కలిపి తీసుకుంటే బరువు ఎక్కువగా పెరుగుతారు. కాబట్టి బరువు పెరగకుండా రోజుకు ఐదు నుంచి ఆరు బాదం పప్పులు తినడం శ్రేయస్కరం. ఈ పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే అయినా.
ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఏ మాత్రం సేఫ్ కాదు. వీటిని ఎక్కువగా తింటే మలబద్దక, కడుపు వాపు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పేగుళ్లలో కరిగే ఆక్సిలేట్ ఈ పలుకుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ యాక్సిడెంట్ మన బాడీలో అధికమైతే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తగిన మోతాదులో తినడమే మంచిది. బాదం పప్పులు ఆరోగ్యానికి మంచివి అయినా.. మరికొందరికి అలర్జీలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య వస్తే వెంటనే వీటిని తినడం మానేయండి. ఇంకొందరులో పెదవులు వాపు గొంతు నొప్పి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఇటువంటివారు ఈ పప్పులకు దూరంగా ఉండడం చాలా మంచిది.