Beauty tips : అందంపై ఆడవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో మగవారు కూడా అటువంటి జాగ్రత్తలు పాటించవలసిందే. ఎండలోకి వెళ్లే వారి చర్మం మరింతగా పొడిబారిపోతుంది. అటువంటివారు చర్మంపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చర్మ రక్షణ విషయానికొస్తే ఆడవారే కాకుండా మగవారి కూడా వర్తిస్తుంది.చర్మం పైన జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఫేస్ ప్యాక్ ఒకటే కాదు. స్త్రీల చర్మం లాగా కాకుండా పురుషుల చర్మం చాలా మందంగా ఉంటుంది.
కాబట్టి ఎన్నో పోషకాలు ఉన్న కలబంద ఫేస్ ప్యాక్ పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. పురుషుల అందాన్ని పెంచే కొన్ని రకాల అలోవేరా పేస్ ప్యాకల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎండలో తిరిగినప్పుడు పురుషుల చర్మం సూర్యరశ్మి వల్ల నల్లగా మారుతుంది. ఈ సూర్య రశ్మి వల్ల నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా చేసుకోవడానికి అలోవెరా జెల్లీ లో రెండు మూడు డ్రాప్స్ నిమ్మ రసాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి.
Beauty tips : పురుషుల అందాన్ని పెంచే ఫేస్ ప్యాక్ ఇదే.

ఈ ప్యాక్ వేసే ముందు ముఖం శుభ్రం చేసుకుని చర్మంపై బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత ఆ ప్యాక్ పై నీటిని చల్లి మర్దన చేస్తూ పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓపెన్ ఫోర్స్ లో ఉన్న మలినాలు ,వ్యర్ధాలు పూర్తిగా నశింపబడతాయి. అలాగే ఎండ నుండి వచ్చిన టాన్ పూర్తిగా తొలిగిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల డెత్ స్కిల్స్ తొలిగిపోయి న్యూ స్కిల్స్ ఏర్పడతాయి