Health Tips : మనం తీసుకునే ఆహార పదార్థాలలో ప్యూరిన్ అనే రసాయనం విచ్చిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిన్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాలలో పేరుకు పోతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్ళు వాపు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, మూత్ర విసర్జన మందులు తీసుకోవడం, అధిక బరువు, సోరియాసిస్, హైపోథైరాయిడజం మొదలైనవి ఉన్నాయి.

లివర్, పుట్టగొడుగులు, బఠానీలు, బీన్స్ లాంటివి ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ని నియంత్రణలో ఉంచాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి అంటున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. యాపిల్ యూరిక్ యాసిడ్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్ వెనిగర్ కూడా యూరిక్ యాసిడ్ తొలగిస్తుంది.
అవకాడో కూడా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, యాంటీ ఇన్ఫ్లమేటరీ కలిగి ఉంటుంది. అందుకే ఇది యూరిక్ యాసిడ్ ను తొలగించడంలో బాగా పనిచేస్తుంది. అరటిపండు కూడా యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది. అరటిపండు రోజు తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే చెర్రీస్ యూరిక్ యాసిడ్ తొలగిస్తాయి. ఇది ఆంథోసైనిన్ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.