Gaddi Gulabi- బంగారం కంటే విలువైన ఈ మొక్క ఎక్కడైనా కనపడితే వదలకండి…

Gaddi Gulabi Health Benefits
Gaddi Gulabi Health Benefits

ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్న ఎంత అందంగా ఇల్లు కట్టుకున్న మొక్కలు లేని ఇల్లు వెలవెలబోతూ అంద విహీనంగా ఉంటుంది. ఇంటి అందాన్ని పెంచడంలో మొక్కలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే అందమైన రంగురంగుల పూలతో పాటు రకరకాల క్రాటర్స్ మొక్కలు కూడా ఇంటి చుట్టూ మనం వేసుకుంటూ ఉంటాం. మనలో చాలామందికి మొక్కల పెంపకం అంటే ఇష్టం ఉంటుంది. కాకపోతే వాటి గురించిన పూర్తి అవగాహన లేకుండా అవి అందంగా ఉన్నాయా లేవా అని మాత్రం చూసి చక్కగా తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటాం. అయితే వాటిలో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతాం. ఈ సృష్టిలో పనికిరాని మొక్క అంటూ ఏది ఉండదు.

Advertisement

మన ఇంట్లో ఈజీగా పెరిగే ఒక అద్భుతమైన మొక్క గురించి అలాగే ఆ మొక్కకు ఉండే ఔషధ గుణాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం. గులాబీ మొక్కలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మంచిగా అంట్లు కడుతూ ఉండాలి. ఇలా గులాబీ మొక్కను సంరక్షించినప్పుడు మాత్రమే చక్కని గులాబీ పూలు పూస్తాయి. అయితే అచ్చం గులాబీ లాగే ఉండే ఏటువంటి సంరక్షణ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం చిన్న కాడ పాతితే చాలు అల్లుకుని అందంగా చిన్నచిన్న గులాబీల ముద్దుగా కనిపించే ఇదిగో ఈ మొక్కే గడ్డి గులాబీ లో కూడా మూడు నాలుగు రకాలు ఉంటాయి. రెడ్ వైట్ మిక్సిడ్ కలర్ ఇలా రకరకాలుగా కూడా ఉంటూ ఉంటాయి. ఈ మొక్క కాండ నిండా నీరే ఉంటుంది. ఈ పూలకు కొంచెం సూర్యకాంతి తాకిన చాలు చక్కగా విచ్చుకుంటాయి.

Advertisement

వీటికి సువాసన లేకపోయినా గాని చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ఆ ఔషధ గుణాలు తెలుసుకుందాం. గడ్డి గులాబీలో Gaddi Gulabi ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఈ మొక్కను ఎవ్వరు అసలు విడిచిపెట్టరు. ఈ మొక్క చర్మం మీద ఉండే ఎటువంటి నల్ల మచ్చలను మొటిమలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మంపై మొటిమలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి అప్పుడు ఈ గడ్డి గులాబీ పువ్వులు తీసుకుని అందులోకి కొంచెం తేనెను కలిపి ముఖానికి పూసి కొంచెం సేపు అలా ఉంచండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడిగేసుకోండి. ముఖం చాలా నునుపుగా అందంగా మెరుస్తుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది.

ఇక అలాగే జుట్టుకు సంబంధించిన సమస్య కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. జుట్టు తెల్లబడితే గనక గడ్డి గులాబీ మొక్క ఆకులను మెత్తగా పేస్టులా చేసి దానిలో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె కలిపి జుట్టుకు పట్టించేయండి. ఇలా పట్టించేసి ఒక గంట పాటు అలా వదిలేయండి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేసేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు కూడా నల్లగా మారితీరుతుంది. చిన్న వయసులో జుట్టు తెల్లబడితే ఇలాంటి హోం రెమిడీస్ ద్వారా లేదా ప్రకృతిలో దొరికే ఇటువంటి మొక్కల ద్వారా చక్కగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి గాయాలపై ఉంచడం వల్ల కూడా గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. గాయాలు కూడా త్వరగా మానుతాయి.

అలాగే విషపూరితమైన పాము తేలు వంటివి అనుకోకుండా కరిచినప్పుడు వెంటనే ఈ మొక్క కాండం నుంచి రసాన్ని తీసి ఆ కరిచిన చోట రాస్తే విషం విరిగిపోతుంది. నొప్పి కూడా త్వరగా తగ్గుతుంది. ఇది కేవలం ఫస్ట్ ఎయిడ్ గా మాత్రమే పని చేస్తుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్లాలి. డాక్టర్ దగ్గరికి వెళ్లే లోపు చేస్తే ప్రథమ చికిత్సగా ఈ టేబుల్ రోజు కాండం ఇలా విషపురుగులు కుట్టిన చోట రాస్తే కొంచెం ఉపశమనం అయితే ఉంటుంది. ఏదేమైనా ఈ గడ్డి గులాబీ మన ఆరోగ్యానికి కాకుండా అందానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా ఒక చిన్న కొమ్మ తెచ్చుకోండి చాలు.. కుండీలో వేసిన పెరుగుతుంది. నేల మీద వేసిన చక్కగా పెరుగుతుంది. ఇంటి ముందు హ్యాండ్ చేసుకున్న అందంగా ఉంటుంది. లేదా కుండీలో పెంచుకున్న అందంగా ఉంటుంది. మీ ఇంటికి మాత్రమే కాకుండా మీ ఒంటికి కూడా అందాన్ని ఇచ్చే ఈ గడ్డి గులాబీని తప్పకుండా మీరు పెంచుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

Advertisement