Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. తినే ఆహారంలో నియమ నిబద్ధతలు పాటిస్తున్నారు.ఏదైనా ఆహారం తీసుకోవాలంటే చాలా భయపడిపోతుంటారు.ఎక్కడ షుగర్ పెరుగుతుందోనని స్వీట్లు, పండ్లు, మిఠాయిలు తినడం మానేస్తుంటారు. అన్నం కూడా మానేసి కేవలం చపాతీలు రాగి ముద్దలు తింటుంటారు. ఒక్కసారి షుగర్ బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే తీపి లేని, త్వరగా అరిగిపోయే ఆహారాలను తీసుకోవాలి. అలాగే శరీరానికి సరిపడా శ్రమను కల్పించాలి. .
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు నూనె పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. బయట ఆహారాలను అస్సలు తినకూడదు. స్వీట్స్, తేనె వస్తువులు, జామ్స్ లాంటివి పూర్తిగా తగ్గించాలి. ఇక డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ తింటే చాలా మంచిది. ఒక పూట బ్రౌన్ రైస్ తీసుకొని రెండో పూట గోధుమలు కాని జొన్నలతో చేసిన ఆహారం తీసుకుంటే తగినన్ని పోషకాలు అందుతాయి. అలాగే షుగర్ పేషెంట్స్ అరటిపండు, సపోటా, సీతాఫలం, ద్రాక్ష లాంటి పండ్లను చాలా తక్కువగా తీసుకోవాలి. వీటిని తినేటప్పుడు షుగర్ లెవెల్స్ చూసుకొని తినాలి. షుగర్ పేషెంట్లు ఎక్కువ పని చేయకుండా కూర్చునే పని అయితే కనుక వాళ్ళు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు మెంతులు పొడిని కొద్దిగా తీసుకోవాలి. అది తీసుకున్న 15 నుండి 20 నిమిషాల తర్వాత భోజనం చేయాలి. ఇది చక్కెర వ్యాధికి వాడిన మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట అయిన వ్యాయామం చేయాలి. నడవడం, వ్యాయామం, ధ్యానం లాంటివి చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఎలా డయాబెటిస్ ఉన్నవారు చిన్నచిన్న ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ తగిన వ్యాయామం చేస్తే డయాబెటిస్ కు మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు.