Plum Fruit Benefits : చాలామంది ఇష్టంగా తినే పండ్లలో అల్ బకరా పండు కూడా ఒకటి. అల్ బకరా పండు తినడం వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.శరీరంలోని ఎముకలు గట్టి పడటానికి రుచికి పుల్లగా ఉండే ఈ అల్ బకరా పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజుకి రెండు చొప్పున ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, ఈ అల్ బకరా పండ్లు వరుసగా మూడు నెలలు తినడం వలన, అందులోని పోషకాలు మన శరీరానికి బాగా పని చేస్తాయి. దానివలన ఎముకలు గట్టిపడతాయి.వీటిని తినడం వలన ఎముకలు మినరల్స్ని, క్యాల్షియంని గ్రహించడంలో తోడ్పడుతుంది. ఈ పండును తినడం వలన రక్షణ వ్యవస్థకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.
డ్రై అల్ బకరా పండును నీళ్లలో నానబెట్టి కూడా తీసుకుంటే చాలా మంచిది. అల్ బకరా పండు లో విటమిన్ ఇ, బీటా కెరొటిన్ను, యాంటీ యాక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి, అవి ఫ్రీ రాడికల్స్ బారి నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి, అవి ఒదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడనివ్వకుండా కాపాడుతుంది. అందువలన యవ్వనంగా కనిపిస్తారు. నల్లగా మారిన పెదవులను ఎర్రగా మార్చడంలో ఈ పండు ఎంతో పనిచేసింది.చర్మంపై మొటిమలు అయినచోట నల్లటి మచ్చలు ఏర్పడతాయి, అవి పోవాలంటే కొల్లాజెన్ ఏర్పడాలి అందుకు ఈ పండ్లు ఎంతగానో దోహదపడతాయి.ఈ పండ్లు తినడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది, చుoడ్రు ని నివారించి, కుదుళ్లు గట్టిపడే లా చేస్తుంది.
Plum Fruit Benefits : అల్ బకరా పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు మీకోసం…
అలాగే క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడుతుంది. ఈ పండ్లలో విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కె, క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తుంది. ఇందులో క్యాల్షియం ఎముకలను గట్టిపరుస్తాయి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సిక్స్ కొలెస్ట్రాల్ను తగ్గించి, రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గర్భిణీ స్త్రీలకు ఇది చాలా మoచిది. ఈ పండును తినడం వలన బేబీ గ్రోత్ చాలా బాగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి ఈ పoడు గొప్ప వరం అని చెప్పవచ్చు.ఇన్ని లాభాలు ఉన్నా ఈ పండ్లను తిని ఎన్నో ప్రయోజనాలను పొందండి.