Tomato juice : భారత దేశంలో టమాటోల వినియోగం ఎక్కువగానే ఉంది. వీటిని వివిధ రకాల కూరల్లో ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా, అందాన్ని రెట్టింపు చేయడంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి. టమాటోలో పోషకాలు అధికంగా లభిస్తాయి.వీటిలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, క్యాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. వీటిని కూరల రూపంలో కాకుండా సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు.
అంతేకాకుండా టమాటో నుండి మరిన్ని ప్రయోజనాలు పొందడానికి చారు రూపంలో తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.ఈ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది.కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ జ్యూస్ రోజు తీసుకోవచ్చు.టమోటో రసంలో విటమిన్ సి ,పొటాషియం, పోలేట్, కెరోటిన్, ప్లేవనాయిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది మధుమేహం వ్యాధిని తగ్గించడంలో ఎంతో గా సహాయపడతాయి. ఈ రసంలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో లైకోపీన్, బీటెక్ కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
Tomato Juice : టమాటో జ్యూస్ తో బెనిఫిట్స్ ఎన్నో..?

ఇవి రోగ నిరోధక శక్తి పెంచడంలో శక్తివంతంగా సహాయపడతాయి. టమాటా జ్యూస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ ఆరోగ్యానికి చేసే మేలు ఎంత ఇంత కాదు. బరువు తగ్గటంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాలను కరిగించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. టమాటో జ్యూస్ శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం తాగడం వల్ల మూత్రపిండాలను శుద్ధి చేయబడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ కణాలు ఎక్కువగా ఉండడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచి రక్తపోటు సమస్యలను నివారిస్తుంది