Health tips : రెండు రూపాయ‌ల బ్రూతో మీ మొహాన్నిఇలా అందంగా త‌యారుచేసుకోండి…

Health tips : మొహంపై అక్క‌డ‌క్క‌డ మ‌చ్చ‌లు రావ‌డం సాధార‌ణ‌మే. మ‌చ్చ‌లు పోవ‌డానికి వివిధ ర‌కాల ఫేస్ ప్యాక్ లు,క్రీమ్స్ ను వాడుతుంటాం. అయిన కొంద‌రికి మ‌చ్చ‌లు త‌గ్గ‌వు. బ్యూటిపార్ల‌ర్ కి వెళ్లి రెండు వేలు, మూడు వేల రూపాయ‌ల‌తో ఫేస్ అందంగా రావాల‌ని ఫేస్ ప్యాక్ లు,వివిధ ర‌కాల ట్రీట్ మెంట్స్ తీసుకుంటూ వుంటారు. అన్ని వేల రూపాయ‌ల‌ను వృధా చేసుకోవ‌డ‌మే కాని ఎటువంటి ప్ర‌యోజ‌నం వుండ‌దు. అయితే ఒక‌సారి బ్రూ కాఫి పౌడ‌ర్ తో మీ ఫేస్ కి ట్రై చేసారంటే అద్భుత‌మైన ఫ‌లితాన్ని చూడ‌వ‌చ్చు.ఈ చిట్కాను ఒక‌సారి ట్రై చేసారంటే మీ ముఖం అందంగా, ప్ర‌కాశవంతంగా మెరుస్తుంది. మ‌రి దీనిని ఎలా త‌యారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…

ముందుగా ఒక గిన్నెలోకి ఒక స్ఫూన్ కాఫి పౌడ‌ర్, ఒక స్ఫూన్ చ‌క్కెర తీసుకోవాలి. ఒక స్ఫూన్ గులాబీ రేకుల పౌడ‌ర్ వేసుకోవాలి. గులాబీ రేకులు లేక‌పోతే టొమాటొ జ్యూస్ కాని బీట్ రూట్ జ్యూస్ కాని వేసుకోవ‌చ్చు. త‌రువాత దీనిలో రెండు స్ఫూన్ల ప‌చ్చిపాలు పోసుకొని బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఫేస్ ను స‌బ్బుతో శుభ్రంగా క‌డుక్కొని, ఈ మిశ్ర‌మాన్ని మొహానికి, మెడ చుట్టూ రాసుకొని ఒక ఐదు నిమిషాల పాటు రుద్దుతూ ఉండాలి. ఐదు నిమిషాల త‌రువాత వాట‌ర్ తో ముఖాన్ని బాగా క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న మీ ఫేస్ లో మ‌చ్చ‌లు పోయి ముఖంలో మంచి గ్లో క‌నిపిస్తుంది.

Health tips : కాఫి పౌడ‌ర్ తో మీమొహాన్నిఇలా అందంగా త‌యారుచేసుకోండి

Health benifits of glowing skin with coffee powder
Health benifits of glowing skin with coffee powder

త‌రువాత ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక స్ఫూన్ బ్రూ కాఫి పౌడ‌ర్, బాగా పండిన అర‌టి పండును స‌గం వేసుకొని బాగా క‌లుపుకోవాలి. అర‌టి పండుకి బ‌దులుగా క‌ల‌బంద గుజ్జును లేదా ముల్తానీ మ‌ట్టిని కూడా వేసుకోవ‌చ్చు. త‌రువాత దీనిలో ఒక స్ఫూన్ ప‌చ్చిపాలు వేసుకొని బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్ కి రాసుకొని ఒక అర‌గంట సేపు వుంచుకోవాలి. త‌రువాత చ‌ల్ల‌టి నీరుతో మొహాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి. ఒక ఐదు, ఆరు గంట‌ల దాకా ఎటువంటి స‌బ్బుతో ఫేస్ క‌డుక్కోరాదు. ఇలా చేయ‌డం వ‌ల‌న మీ మొహం సున్నితంగా, అందంగా, ప్ర‌కాశ‌వంతంగా త‌యార‌వుతుంది. మీకు ఈ చిట్కా న‌చ్చితే ఒక‌సారి ఇంట్లో ట్రై చేయండి. మంచి ఫ‌లితాన్ని పొందుతారు.